MNCL: బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరీ చర్చి వెనుకాల రైలు పట్టాలు దాటుతుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీ కొని శనివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడి వివరాలను కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.