మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులం ఈ నెల 9 నుంచి 8 రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని ముంబై, యూపీలోని వారణాసి, అయోధ్య, ఏపీలోని తిరుపతిలను సందర్శిస్తారు. ప్రస్తుత పదవీకాలంలో ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.