TG: సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ విషయంపై MP రఘునందన్ రావు, నవోదయ స్కూల్ డిప్యూటీ కమిషనర్‌తో చర్చించారు. ఈ పాఠశాల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించగా, ప్రతి ఏడాది రూ.500 కోట్ల చొప్పున 3 ఏళ్లు నిధులు వస్తాయని ఎంపీ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక భవనంలోనే పాఠశాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.