CTR: వెదురుకుప్పం మండల పరిధిలోని పచ్చికాపల్లం పీహెచ్సీని జిల్లా వైద్యాధికారిని సుధారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై ఆమె ఆరాతీశారు. ఈ మేరకు గర్భిణులతో, పేషంట్లతో మాట్లాడారు. దీంతో హైరిస్క్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను, మందుల నిల్వ గదిని పరిశీలించారు.