TPT: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మోడీ మెతక వైఖరిని వీడాలని CPM – CPI పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సత్యవేడు కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు CPI నాయకులు చిన్నిరాజ్ మాట్లాడుతూ.. తక్షణమే పెంచిన సుంకాలను తగ్గించేలా డోనాల్డ్ ట్రంప్‌పై మోడీ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.