TPT: అలిపిరి పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రమ్య(6 నెలలు) మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. దీంతో SP హర్ష వర్ధన్ రాజు పోలీసు సిబ్బందితో గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే మూడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసిన SP నగరం నుంచి వెళ్లే ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీ చేస్తున్నారు. కాగా, పాప ఇంటి వద్ద అనుమానితుల వివరాలపై ఆరా తీస్తున్నారు.