ATP: అనంతపుంరలో జరగనున్న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభను సూపర్ సక్సెస్ చేద్దామని జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. జనసేన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ నెల 10న తొలిసారి అనంతపురానికి వస్తున్నారని తెలిపారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.