'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అవికా గోర్. ఆ సీరియల్ అప్పట్లో ప్రతి మహిళకూ దగ్గరైంది. అవికా గోర్ కు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అవికా గోర్. ఆ సీరియల్ అప్పట్లో ప్రతి మహిళకూ దగ్గరైంది. అవికా గోర్ కు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
ఉయ్యాలజంపాలా సినిమా ద్వారా అవికా గోర్ తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరో రాజ్ తరుణ్ తో ఆ సినిమాలో జతకట్టి మంచి మార్కులు పొందింది.
తాజాగా అవికా గోర్ నిర్మాతగా మారింది. పాప్ కార్న్ అనే సినిమాను నిర్మించి అందులో తానే హీరోయిన్ గా నటించింది. అవికా గోర్ కు జంటగా ఈ సినిమాలో సాయి రోనక్ నటించాడు.
మురళి గంధం దర్శకత్వంలో పాప్ కార్న్ సినిమా రూపొందింది. తాజాగా ఈ మూవీ విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దీంతో అటు నిర్మాతగాను, ఇటు హీరోయిన్ గానూ అవికా గోర్ సక్సెస్ అయిందని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా అవికా గోర్ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.