2009లో వచ్చిన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియెన్స్‌ను కొత్త ప్రపంచలోకి తీసుకెళ్లిన ఈ విజువల్ వండర్ ఎన్నో రికార్డులను సృష్టించి.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో అవతార్ 2 కనీవిని రికార్డ్స్ క్రియేట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. పుష్కర కాలం గడిచిపోయినా అవతార్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కాబట్టి డిసెంబర్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతం జరగబోతోందని చెప్పొచ్చు. అయితే అంతకు ముందే అవతార్ రీ రిలీజ్ సంచలనం క్రియేట్ చేసేలా ఉందంటున్నారు. సెప్టెంబర్ 23న రీ రిలీజ్ అయిన అవతార్ భారీ కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది.
ఒక్క భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ పరంగా కోటికి పైగా వచ్చినట్టు సమాచారం. దాంతో వీకెండ్ వరకు 5 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా కలిపి తొలి రోజు అవతార్ రీరిలీజ్ కలెక్షన్లు 2 కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని అంటున్నారు. ఓ రీరిలీజ్ సినిమాకు ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం సంచలనం అనే చెప్పొచ్చు. అవతార్ రీ రిలీజ్‌కు ఇంత రెస్పాన్స్ రావడం చూస్తుంటే.. జనాలు అవతార్ 2 కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.