Athidi Web Series: స్ట్రేంజ్ బ్యూటీ ఫస్ట్ ఎపిసోడ్.. చుట్టంతా చీకటి, కీచురాళ్ల శబ్ధం గుండెల్లో దడపుట్టించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒక పచ్చని జొన్న చేనులోంచి ఒక వ్యక్తి భయంతో ఆయాస పడుతూ.. ఊపిరి గట్టిగా తీసుకుంటూ వచ్చి వీధిలో ఎలుగుతున్న బల్బును చూసి అక్కడికి పరుగెడుతాడు. గుండెల్లో దడపుట్టించే ఆర్ఆర్ తో వ్యక్తి దమ్ము తీసుకుంటుండగా అతనికి ఒక ఫోన్ వస్తుంది. అవతలి వ్యక్తి తనకు పొద్దుటినుంచి ఫోన్ చేస్తున్నట్లు.. ఫోన్ రీచ్ అవట్లేదని చెప్పడంతో.. ఇప్పుడే చావునుంచి తప్పించుకొని వచ్చాను అంటాడు. చావునుంచి తప్పించుకోవడం ఏంటన్నా అని ఫోన్లో వ్యక్తి అనడంతో అవన్ని తరువాత చెబుతాను ఆ పిల్ల ఇంకా అక్కడే ఉందా అంటాడు. ఆ ఇక్కడే ఉంది వదిలేయమంటావా అని ఫోన్ లో వ్యక్తి అంటాడు. రే ఇప్పుడు నేను వస్తున్నాను దాన్ని వదిలేదే లేదురా అనే సరికి వీధి లైట్ వెలుగుతూ ఆగిపోతూ అలా జర్క్ లు ఇస్తుంది. భయంతో ఆ వ్యక్తి గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయంకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్క సారిగా లైట్ ఆగిపోగానే ఆ వ్యక్తి పెద్దగా అరుస్తాడు.. కట్ చేస్తే దూరంగా ఒక మెరుపు మెరుస్తుంది. ఆకాశం నుంచి కెమెరా టిల్ట్ డౌన్ చేస్తూ ఇక వీధిలో లైట్ ను కనిపిస్తుంది. నెక్ట్స్ సీన్ లో గోస్ట్ హంటింగ్ యూట్యూబ్ వీడియోలు చేసే సవారి తనను తాను పరిచయం చేసుకుంటాడు.
చదవండి:Shraddha Kapoor: పెళ్లి కామెంట్లపై స్పందించిన శ్రద్ధా కపూర్!
తన సవారి హంట్ ఛానెల్ లో 100 వ వీడియోగా దెయ్యాల మిట్ట అనే స్పెషల్ వీడియోను షూట్ చేయడానికి అతను ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ చాలా మందిని దెయ్యాల మిట్ట గురించి అడిగితే భయపడి ఏం చెప్పకుండా వెళ్లిపోతుంటారు. అయితే ఇద్దరు వృద్దులు ఆ మిట్ట గురించి చెప్పడానికి వస్తారు. చాలా ఏళ్ల కిందట ప్రేమించి మోసపోయిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి ఆ అమ్మాయి దెయ్యం అయి ఒంటరిగా వచ్చే మగవాళ్లను అంటుకుంటు ఉంటది అని చెప్తాడు. అలాగే ఆ వీధి మలుపు కాడ కొన్ని వీధి బల్బులు ఎప్పుడూ ఆరిపోయుంటాయని.. మగవాడు ఒంటరిగా వెళ్తుంటే మొదటి బల్బు దగ్గరకు వెళ్లగానే బైక్ లైట్ ఆగిపోతుంది. మూడవ బల్బు వద్దకు వెళ్లగానే బైక్ ఆగిపోతుంది. ఆ తరువాత ఆ దెయ్యం చెట్లెంట, పుట్టలెంట తరిమి తరిమి చంపుతుంది అని చెప్తారు. అదే చంపకుండా ఉండాలంటే బండిని తోసుకుంటు అలాగే వెళ్తుంటే మూడో స్తంభం దాటగానే బండి ఒక్క కిక్ కే స్టార్ట్ అవుతుందని అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పారిపోతే ప్రాణాలు కాపాడుకోవచ్చిని ఆ ఇద్దరు వృద్దులు చెబుతారు.
వారి మాటలు విన్న సవారి మీలో ఎవరన్నా ఆ దెయ్యాన్ని చూశారా అని అడుగుతాడు. లేదని, ఎవరు చూడలేదు.. చూసినోళ్లు ఎవరు బతకలేరు అని అంటారు. ఇదంతా తన యూట్యూబ్ ఛానెళ్లో లైవ్ పెట్టిన సవారి ఎవరి చూడంది ఇదంతా వీరికెట్ల తెలిసింది. చనిపోయిన వారు ఎమన్నా చెప్పారా అని అంటాడు.. ఎలాగైన ఈ రోజు ఈ మిస్టరీని బయటపెడుతా అని, రాత్రి తాను ఒక్కడే అక్కడి వెళ్తున్నట్లు చెప్తాడు. అయితే తాను దయ్యాలు నమ్మనని, అవి అసలు లేవని కూడా చెప్తాడు. అలాగే తన ఛానెళ్ కు లైక్ కొట్టి సబ్ స్క్రైబ్ చేయమట్టాడు. టైటిల్ పడుతుంది. టైటిల్స్ పడేప్పుడు ఒక కోటను చూపిస్తారు. కూరగాయలు కట్ చేస్తూ రాజా రవి వర్మ(వేణు) ఎంట్రీ ఉంటుంది. తరువాత బైనక్యూలర్ లో చూస్తూ వర్షం, మేఘాల కారణంగా ఏం కనిపించట్లేదని, మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. కట్ చేస్తే పైన రూమ్ లో బెల్ కొట్టగానే కొన్ని డిషేస్ పట్టుకొని పైకి వెళ్తాడు. అక్కడ తన వైఫ్ బుక్ చదువుతుంది. తను ఫుడ్ కలిపి తినిపిస్తాడు. తాను ఒక రచయిత. తాను రాసిన బుక్ నే చదువుతుంది.
కథలో కొత్తదనం లేదు. ఈ జనరేషన్ ను తగ్గట్టు రాయోచ్చుగా అంటే.. మహాభారతం కొన్ని యుగాల నాటిది ఏ జనరేషన్ కు అయిన గుణపాఠం లాంటిది అని డైలాగ్ చెప్తాడు. దానికి గుణపాఠాలు చెప్పడానికి నువ్వేమి దేవుడివి కాదని అంటుంది. అయిన ఈ నాలుగు గోడల మధ్య ఉంటే ఏం కొత్త ఆలోచనలు రావు అని అలా బయటెళ్లి చూస్తే నాలుగు కొత్తవిషయాలు తెలుస్తాయని చెప్తుంది. దానికి తానోక్ రైటర్ అని ఎక్కడున్నా కథ రాయగలను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు రాజా రవి వర్మ. మళ్లీ వెనక్కి వచ్చి తన వైఫ్ కు ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి తిన్న తరువాత టాబ్లెట్స్ వేసుకోవడం మరిచిపోవద్దు అని వెళిపోతాడు.
కిందకు వచ్చి ఈ జనరేషన్ తగ్గట్టుగా కథరాయాల అని ఆలోచిస్తుంటాడు. తరువాత తన టైప్ రైటర్ దగ్గర కూర్చొని కథను రాస్తుంటాడు. ఈ జనరేషన్ కు తగ్గట్టుగా అంటే కాస్తా రోమాంటిక్ గా రాద్దామనుకుంటాడు. అంతలోనే తనకో ఆలోచన వచ్చి.. కథ మొదలు పెడుతాడు.
వర్షం కురిసిన రాత్రి ఒక అందమైన అమ్మాయి తడుస్తూ ఉంది. దూరంగా ఇక బంగ్లా కనిపించడంతో అక్కడి వెళ్లి తలుపు తడుతుంది అని రాస్తుండగా బయట డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. మొదట తాను ఇమాజినేషన్ అనుకొని మళ్లీ రాస్తుండగా మళ్లీ డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఈ టైమ్ లో ఎవరా అని ఆలోచిస్తూ వెళ్తాడు. డోర్ దగ్గర ఉండి కాసేపు చూసి డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక అందమైన అమ్మాయి తన ఎదురుగా ఉంటుంది. తన పేరు మాయ అని, వర్షంలో ఎటువెళ్లాలో తెలియదని ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండచ్చా అని అడుగుతుంది. దానికి రాజా రవి వర్మ ఇప్పుకొని లోపలికి రమ్మంటాడు.
తాను ఇంట్లోకి వచ్చి ఇళ్లు చూస్తూ చాలా బాగుంది అని చెప్తుంది. అలాగే తాను ఒక పని మీద వచ్చినట్లు తడిసిన బట్టలతో కంఫర్ట్ గా ఉండదని చెప్పడంతో.. తన వైఫ్ రూమ్ కి వెళ్లి ఒక డైరీని తీసుకొని ఈ జనరేషన్ కు తగ్గట్టు కథ రాస్తున్న అని చెబుతాడు. తరువాత తన వైఫ్ డ్రెస్ తీసుకొని తనకు ఇస్తాడు. టీ, ఆర్ కాఫీ అని అడిగితే ఆ అమ్మాయి వొడ్కా అని అంటుంది. ఈ వెదర్ కు అవి సరిపోవు అని చెబుతుంది. గుడ్ ఛాయిస్ అని హీరో అంటాడు. తాను ఫ్రెష్ అవడానికి అక్కడి నుంచి వెళ్తుంది. హీరో అలానే చూస్తూ ఉంటాడు. తన ఒక రూమ్ లోకి వెళ్లీ డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుంటే.. డోర్ మెళ్లిగా ఒపెన్ అవుతుంది. అది చూసిన హీరో వెళ్లి డోర్ వేస్తాడు. తాను కథ రాస్తున్న విషయాన్ని తన వైఫ్ కు చెబుతాడు. ఆ కథలో అమ్మాయి వొడ్కా అడిగింది అంటే అమ్మాయి అంత త్వరగా అర్థం కాదని.. కాని అమ్మాయిలను నవ్విస్తూ, కవ్విస్తూ… తన అందాన్ని పొగుడుతూ ఉంటే తన గురించి అన్ని తెలుస్తాయి అని చెబుతుంది.
కట్ చేస్తే హీరో కిందికి వచ్చి వొడ్కా ఫిక్స్ చేస్తుంటాడు. తాను అప్పుడే రెడీ అయి అక్కడి వస్తుంది మాయ. రాజా రవి వర్మను చూసి నవ్వుతుంది. చీర నీకు చాలా బాగుంది అని అనగానే ఇచ్చింది మీరేగా అందుకేనేమో అని అంటుంది. ఇద్దరు కూర్చొని తాగుతుండగా.. హీరో ప్లర్టింగ్ చేద్దామనుకుంటాడు. అలాగే తన గురించి అడుగుతాడు. తాను దెయ్యాల మిట్ట గురించి తెలుసుకోవాలని వచ్చినట్లు చెబుతుంది. తానోక సైకిక్ హేలర్ అని తనకు దెయ్యాలు కనిపిస్తాయని, దాని కోరిక ఏంటో తెలుసుకోవాలని వచ్చినట్లు చెబుతుంది. ఆ మాటలకు హీరో కొంచెం ఆలోచించి నవ్వుతాడు. దానికి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. ఊర్లో జనాలు దాని గురించి మాట్లాడితే నవ్వోస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు వాళ్లలానే మాట్లాడుతుంటే నవ్వొచ్చిందని.. ఇది రాతి యుగం కాదు, రాకెట్ యుగం అని అంటాడు. దానికి తాను నేపాల్ లో 6 ఏళ్ల పిల్లాడు 72 ఏళ్ల ముసాలాడిలా మట్లాడుతూ 60 ఏళ్ల క్రింద జరిగిన విషయాలను గురించి చెప్పాడు. అది తెలుసా అని ఇది సైన్స్ కు మించి అని చెబుతుంది. దానికి తాను ఒప్పుకోడు. దాంతో తన రెండు చేతులు పట్టుకొని కొన్ని నిజాలు చెబుతుంది. ఈ ఇంట్లో తన వైఫ్ తో ఉంటున్నాడని, తాను పూర్తిగా బెడ్ రిడెన్ పేషేంట్ అని చెబుతుంది. రాజా రవి వర్మ ఆలోచనలో పడుతాడు.
తన వైఫ్ గురించి చెబుతూ కాళ్లు రెండు పార్లైజ్ అయినట్లు చెబుతాడు. ఎదైన మిరకల్ జరిగి నీ వైఫ్ కిందికి వస్తే నీ విష్ ఏంటి అని అడుగుతుంది. తనతో డ్యాన్స్ చేయాలి ఉందని చెబుతాడు. దానికి తాననే వైఫ్ గా ఊహించుకొని డ్యాన్స్ చేయమంటుంది మాయ. ఇద్దరు కాసేపే డ్యాన్స్ చేస్తారు. అలా రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తుంటే డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అన వెళ్లి చూసేసరికి సవారి హడావిడిగా లోనికి వచ్చి తన మొబైల్ ఛార్జింగ్ పెడుతాడు. అర్జెంట్ గా ఒక ఫోన్ చేసుకోవాలి అని తన ఫ్రెండ్ కు కాల్ చేస్తాడు. దెయ్యాలు నిజంగానే ఉన్నట్లు తన స్నేహితుడితో చెబుతాడు. అంతలో మాయ మెల్లిగా హర్రిబుల్ గా కనిపిస్తుంది. వేణు అలా చూస్తూ ఫ్రీజ్ అవుతాడు. ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ అయిపోతుంది.
టు షార్ట్ స్టోరీస్ ఎపిసోడ్ 2 మొదలౌవుంది. ఫ్యూ డేస్ బ్యాక్ అని పడుతుంది. దెయ్యాల మిట్ట వద్దకు సవారి ఒక్కడే తన బైక్ మీద వేళ్తుంటాడు. అదే విషయాన్ని తన ఛానెళ్లో చెబుతుంటాడు. తన దగ్గర ఒక ఈఎమ్ఎఫ్ రీడర్ ఉన్నట్లు అది చుట్టు పక్కల ఏదైన దెయ్యాలు, ఆత్మలు ఉంటే మనకు ఇండికేట్ చేస్తుందని చెబుతూనే ఇదంత ఒక బుల్ షీట్ అని అంటుంటాడు. అలా వేళ్తుండుగా ఆరిపోయిన మొదటి దీపస్తంభం దాటగానే తన బైక్ లైట్ ఆగిపోతుంది. అలాగే మూడవ స్తంభం దగ్గరకు పోగానే టాప్ యాంగిల్ నుంచి బ్యాక్ షాట్ లో ఒక వైట్ శారీ కట్టుకొన్న ఆకారం కనిపిస్తుంది. అలా మూడవ స్తంబం దగ్గరకు వెళ్లగానే బైక్ ఆగిపోతుంది. అది అంతా సరాదా అనుకొని బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంతలో ఒక లేడీ కాలి కజ్జెల చప్పుడు చేసుకుంటు పరిగెత్తినట్లు వినిపిస్తుంది. అతను ధైర్యాన్ని కూడగట్టుకొని ఎవరు అని అరుస్తుంటాడు. ఇక్కడ ఎవరో ఉన్నట్లు ఉన్నారు అని మిట్టపైకి వెళ్తున్నట్లు తన యూట్యూబ్ లో చెబుతూ.. టార్చ్ పట్టుకొని మిట్ట ఎక్కతాడు. అక్కడ ఎవరో లేడీ ఉన్నట్లు చూసి ఆమె దగ్గరకు వెళ్లి ఏం భయపడకండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెబుతుండగా.. తన దగ్గర ఉన్న ఈఎమ్ఎఫ్ రీడర్ యాక్టివేట్ అవుతుంది. తల ఇరబోసుకొని, వైట్ చీర కట్టుకున్న ఆవిడ ఒక్క సారిగా అతని వైఫ్ తిరుగుతుంది. ముందు సరదా అనుకున్న సవారి సరదా తిరి పోద్ది. ఒక్క సారిగా అతని చేయి పట్టుకుంటుంది. అక్కడి నుంచి తప్పించుకొని తన బైక్ ను స్టార్ట్ చేస్తూ వస్తాడు. అది చివరి స్తంబం దాటగానే బైక్ స్టార్ట్ అవుతుంది. అటు ఇటు చూసి ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని వెళ్లిపోతాడు.
కట్ చేస్తే కోటలో పానిక్ అయి సవారి కూర్చొని ఉంటాడు. ఆర్ యూ ఒకే సవారి అని రాజా రవి వర్మ అడుగుతాడు. నేను ఎన్నో హంటెడ్ ప్లేస్ లకు వెళ్లాను కాని ఇలా ఎప్పుడు జరగలేదు అని అంటాడు. దానికి రాజా రవి వర్మ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. టెన్షన్ లో బైక్ ఆగిపోయి ఉంటుంది. ఫాస్ట్ గా నెట్టుకుంటు పోయినందుకు ఫస్ట్ కిక్ కే స్టార్ట్ అయి ఉంటుందని దెయ్యాలు, భూతాలు ఏం లేవని చెబుతాడు. తరువాత కొన్ని వాటర్ తీసుకొని వస్తా అని వేణు లోపలి వెల్లగానే అతను కూర్చున్న టేబుల్ ముందు వాటర్ బాటిల్ ఉంటుంది. దానిపై పారిపో అని రాసి ఉంటుంది. అది చూసి షాక్ అయి.. కళ్లు నలుచుకొని చూసేసరికి అది మాయం అవుతుంది. నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాయ అంటుంది. తరువాత రాజా రవి వర్మ సవారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే.. ఆవిడా మీ వైఫా అని అడుగుతాడు. తాను కూడా నీలానే హెల్ప్ కోసం వచ్చిందని రాజా రవి వర్మ చెబుతాడు. ఎవరో ఏంటో తెలియకుండా అలా ఎలా రానిస్తారు గురు అని అంటాడు సవారి. దానికి ఏ నువ్వు రాలేదా.. తాను అలాగే అని బదులిస్తాడు. అక్కడ దెయ్యం కూడా ఆడదే అని సవారి అంటాడు. దానికి రాజా రవి వర్మ.. దెయ్యాల మిట్ట దగ్గర ఉన్న దెయ్యం కొరిక తెలుసుకోవడానకి వచ్చిన సైకిక్ హేలర్ అని మాయను పరిచయం చేస్తాడు. దానికి సవారి ఆశ్చర్యపోతాడు. అయితే దెయ్యాలు కొరికలు తిరిపోతే వెళ్లిపోతాయా అని సవారి అడుగుతాడు. అసలు దెయ్యాలు లేవని వేణు అంటుండగా.. దెయ్యాలు ఉన్నాయి. అతను చెప్పేది నిజం అని మాయ అంటుంది. దెయ్యాల కథలు అన్ని జస్ట్ జోక్స్ అని కొట్టిపడేస్తాడు. తన మాటలకు మాయ హర్ట్ అవుతుంది. రాజా రవి వర్మ గురించి తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి ఇళ్లు చూస్తారు. తన లైబ్రరీ గురించి చెబుతుంటాడు. మాయ ఇంట్రెస్టింగ్ గా బుక్స్ చూస్తుంది. అయితే మాయ కొంచెం అలుగుతుంది. దెయ్యాల మిట్ట ఆలోచనల నుంచి బయట పడడానికి సవారి వేణు రాసిన కథల గురించి అడుగుతాడు. మాయ వినకుండా కాఫీ తీసుకొని వెళ్లిపోతుంది. తన రాస్తూ మధ్యలో వదిలేసిన కథల గురించి చెప్పడం మొదలు పెడుతాడు. అందులో స్టోరీ 1.
ఒక పాప (సోని) పీయానతో మ్యూజిక్ ప్లే చేస్తుంది. తాను అంతగా ఫర్పెక్ట్ ప్లే చేయడం లేదని వాళ్ల మదర్ కొప్పడుతుంది. రేపటి కల్లా ఫర్ఫెక్ట్ గా ట్రైన్ చేస్తా అని మాస్టర్ అంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని ఇలానే వాయిస్తే వాళ్ల ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందని.. రేపుటి వరకు ఫర్ఫెక్ట్ గా ప్లే చేయకపోతే నువ్వు నా కూతురూ కాదని చెప్తా అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది సోని తల్లి. ఆ మాటలకు పాప బాధపడి ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే స్టోరీ 2లో రఘు టవల్ తో తల తుడచుకుంటూ వస్తాడు. తన ఇంట్లో వస్తువులు అన్ని ఎక్కడపడితే అక్కడే పడి ఉంటాయి. తాను ఇర్రెస్పాన్స్ గా ఉంటాడు. పాచిపోయిన వాసన, ఈగలు వస్తుందడంతో ఇబ్బంది పడుతాడు. దాంతో ఫోన్ చేసి తనకు ఒక పని రాక్షసుడు కావాలి సుబ్బరావుకు చెప్తాడు.
స్టోరీ1లో సోని ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే మాస్టర్ వచ్చి తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. సోనిని సెడ్యూస్ చేస్తుంటాడు. స్టోరీ టూ లో రఘు పడుకొని లేవగానే పనోడు వస్తాడు. కట్ చేస్తే సోని పియానో ప్రాక్టీస్ చేస్తుంది. ఎన్ని సార్లు ట్రై చేసిన తప్పుగా వస్తుంది. అదేంటని ఆలోచిస్తే మాస్టరే నోట్ తప్పుగా ఇచ్చినట్లు చెబుతూ.. నోట్ నేను ఇస్తాను నాకు కావల్సింది ఇస్తావాని అని మళ్లీ సెడ్యూస్ చేస్తాడు. మ్యూజిక్ నోట్ కావాలంటే చెప్పింది చేయాలని నోట్స్ చించేస్తాడు. తరువాత సీన్లో పని చెప్పండయ్య అంటూ రఘు ఇంట్లో పని మనిషి అన్ని పనులు స్పీడ్ గా చేస్తాడు. తినేప్పుడు, పడుకునేప్పుడు కూడా పని చెప్పండయ్య అని అడుగుతుంటాడు. దానికి రఘు కాళ్లు నొక్కమని చెబుతాడు. ఇవి రెండు కథలు వీటికి క్లైమాక్స్ చెప్పు అని సావారిని అడుగుతాడు రాజా రవి వర్మ.
దానికి సవారి చెప్పిన క్లైమాక్స్ లకు రాజా రవి వర్మ సార్టీస్ ఫై అవడు. అదే సమయంలో మాయ చంపేయండి అని చెబుతుంది. చిన్నపిల్లను సెడ్యూస్ చేయడం, డబ్బు అహంతో మనుషులను హీనంగా చూడడం రెండు తప్పులే వాళ్లిద్దరిని చంపేయండి అని అంటుంది. దానికి రాజా రవి వర్మ ఎవరు చంపుతారు అని అడిగితే. దెయ్యం వచ్చి చంపింది అని రాయండి. దెయ్యాలు ఎప్పుడు చెడ్డవేనా, మంచివి కూడా ఉంటాయి కదా అని మాయ అంటుంది. అదే సమయంలో సావారికి డౌట్ వచ్చి తన వద్ద ఉన్న ఈఎమ్ఎఫ్ రీడర్ బయటకు తీయగానే అది యాక్టివేట్ అవుతుంది. సావారి భయంతో మాయను చూస్తాడు. వేణును పక్కకి తీసుకెళ్లి మాయలో దెయ్యం ఉందని చెబుతాడు. దానికి వేణు అదేమి లేదని వారిస్తాడు. ఈఎమ్ఎఫ్ రీడర్ ను కూడా చూపిస్తాడు సవారి. దాన్ని కూడా తప్పు అని చెప్తాడు వేణు. దానికి తానే దెయ్యాన్ని వెంటపెట్టుకొచ్చినట్లు.. దెయ్యాల మిట్ట నుంచి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, కాని తాను చూశానని అందుకే.. తాను ఇంటికి వచ్చినప్పటి నుంచి మాయా ప్రవర్తనలో తేడా ఉందని చెప్తాడు. అంతలో మాయ కిటికి తెరిచి వాష్ రూమ్ యూజ్ చేసుకోవాలి అని అడుగుతుంది. రాజా రవి వర్మ వాష్ రూమ్ చూపించడానికి వెళ్తుంటే మిర్రర్ లో తన ఇమేజ్ కనిపించదు. దానికి సవారి వెళ్లిపోదమని చెప్తుంటే రాజా రవి వర్మ లైట్ తీసుకుంటాడు. కథలకు ముగింపు ఇద్దామా అని మాయ అంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది.
ద మర్డర్ మూడో ఎపిసోడ్ మొదలౌతుంది. కథలకు ముగింపు ఇవ్వాలని అంటుంది మాయ. దానికి నేను దెయ్యాలను నమ్మను అలాంటిది కథలోకి వాటిని తీసుకురావడానికి టైమ్ పడుతుందని చెబుతాడు. నా చేతులు పట్టకొని ఆలోచించు అని మాయ అంటుంది. అలాగే అని రాజా రవి వర్మ ట్రై చేస్తా అంటాడు. చేతులను పట్టుకోబోతుంటే సవారి గురించి ఆలోచించి ఆగిపోతాడు. ఒక వైపు మాయలో దెయ్యం ఉందని, దెయ్యం చేతులో చనిపోయాన సవారి అని అందరూ మీమ్స్ చేస్తారని సవారి వెళ్లిపోదాం అనుకుంటాడు. అంతలో ఈ కథలు నీ యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు ఫేమస్ అయిపోతావు అనగానే సవారి ఒక్క క్షణం ఆగుతాడు. కట్ చేస్తే వన్ ఈయర్ ఎగో అని సవారి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. 1 ల్యాక్ సబ్ స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ బటన్ తో తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లితే, తాను 1 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్న అతనితో కార్లో వెళ్లిపోతుంది. అది గుర్తుకు వచ్చి ఎలాగైన ఫేమస్ అవ్వాలని దెయ్యాన్ని వీడియో తీస్తే 100 మిలియన్ల సబ్ స్క్రైబర్లు వస్తారు అని రిస్క్ చేస్తాడు. వాళ్లతో కలిసి కథ వినడానికి ఒప్పుకుంటాడు. మాయ చేతులు పట్టుకొని వేణు కథ చెప్తాడు.
స్టోరీ వన్ లో సోని సుసైడ్ లెట్టర్ రాస్తుంది. పాయిజన్ టాబ్లెట్స్ తీసుకుందామని సమయానికి డోర్ బెల్ సౌండ్ వస్తుంది. వెళ్లి తీస్తే తనకు మ్యూజిక్ నోట్స్ అక్కడ లభిస్తుంది. కట్ చేస్తే సోని రెడీ అయ్యి మాస్టర్ ఇంటికి వెళ్తుంది. మాస్టర్ పెగ్ వేస్తూ తనను ఇంట్లోకి రమ్మాంటాడు. సోని అలా వెళ్లి పియానో వాయిస్తుంది. మాస్టర్ ఇప్పుడే వస్తాను అని వాష్ రూమ్ లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటండగా.. సోని కరెక్ట్ గా ప్లే చేస్తుంది. అది ఎలా పాజిబుల్ అని బయటకు రాగానే తన ఇంట్లో మ్యూజిక్ ఇనిస్ట్ర్యూమెంట్స్ అన్ని వాటంతట అవే ప్లే అవుతుంటాయి. అక్కడ సోని ఉండదు. అలా అతని తల బద్దలు అవుతుంది. కొద్దిసేపు తరువాత వాయిలిన్ ప్లే అవుతూ తన పీకను కోసేస్తుంది. కట్ చేస్తే సోని ఫర్ఫెక్ట్ గా పియానో ప్లే చేస్తుంది.
కట్ చేస్తే రఘు కాల్లు పట్టమన్నందుకు కాళ్లు ఎర్రగా అయ్యేలా నొక్కుతుంటాడు పని రాక్షసుడు. అతన్ని కొప్పపడి సుబ్బారావుకు ఫోన్ చేసి ఎవన్ని పంపించావు అని అరుస్తాడు. నేను ఎవరిని పంపలేదు అనే సరికి రఘు ఆశ్చర్యపోతాడు. తాను పని రక్షసుడు అని పని చెప్పకపోతే చంపేస్తా అని రఘును పని రాక్షసుడు చెంపేస్తాడు. కట్ చేస్తే రెండు స్టోరీలు బాగున్నాయి అంటాడు వేణు. కాని సవారి బయపడుతాడు. అసలు ఆమె మనిషే కాదు. దెయ్యం అని అరుస్తాడు. గట్టిగా తాను దెయ్యం అని అరిచేసరికి కరెంట్ పోతుంది. అంతలో మాయ అక్కడ మాయం అవుతుంది. మాయా అని వెతుకుతాడు వేణు. అంతలో వేణు కూడా మాయం అవుతాడు. అంతలో చెయిర్ ఊగుతున్న సౌండ్ వినిపిస్తుంది. అక్కడి వెళ్లి చూసేసరికి చెయిర్ ఊగడం ఆగిపోతుంది. దీపాలు ఆరిపోతాయి. ఎవరో పరిగెత్తినట్లు అనిపిస్తుంది. అంతా చీకటి సవారి శ్వాస తప్ప మరేది వినిపించదు. అంతలో సవారి ముందు నుంచి ఎవరో పరిగెత్తినట్లు అనిపించే సరికి భయపడి వెనక్కి పడుతాడు. వేణు వచ్చి లేపుతాడు. దెయ్యం అటు వెళ్లింది అని చూపిస్తాడు సవారి. వేణు టార్చ్ లైట్ పెట్టి వెతుకుతాడు. సవారి పారిపోదం అని వెళ్తుంటే డోర్ క్లోజ్ అవుతుంది. ఇది థార్డ్ స్టేజీ అని భయపడి వేణుతో పాటు వెళ్తాడు. అక్కడ వెతుకుతుంటే మా య కనిపిస్తుంది. కళ్లు మూసుకుని శ్వాస పీల్చుకుంటుంది. అది చూసి మాయ ఏం జరిగింది. నీకు ఏం అయింది అని అడుగుతుంటే ఒక్కసారిగా కళ్లు తెరుస్తుంది. కళ్లు మారిపోతాయి.
ఒక్క సారిగా గట్టిగా అరుస్తుంది. తరువాత సీన్లో తన కోరిక తీరిస్తే ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లిపాతావా అని అడిగే సరికి తన కోరిక చెబుతుంది. నగలు వేసుకొని అందమైన పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తే వెళ్లిపోతా అంటుంది. అలాగే అని వేణు తన వైఫ్ నగలు తీసుకొచ్చి మాయకు ఇస్తాడు. ఆ నగలు వేసుకొని మాయ మురిసిపోతుంది. తానను ఒక సారి చూసుకోవాలి అని అద్దంలో చూసుకొని తను తాను కాదని అరుస్తూ.. కత్తి తీసుకొని పొడుచుకొని చనిపోతుంది మాయ. ఏం చెయాలో తిలియక వేణు, సవారి ఆలోచిస్తారు. బాడీని ఎలా మాయం చేయాలని ఆలోచిస్తారు. పోలీసులకు చెబితే వాళ్లను లాకప్ లో వేస్తారని అనుకుంటారు. సవారి తన ఫోన్లో ఉన్న కెమెరా కూడా సరిగ్గా రికార్డు చేయదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని అంటుండగా బయట నుంచి ఏదో వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని ఆలోచిస్తారు. అంతలో బెల్ మోగుతుంది. ఒంకోవైపు డోర్ కొడుతారు. సవారి కిటికిలోంచి చూస్తే వచ్చింది పోలీసులు. పైనుంచి రాజా రవి వర్మ వైఫ్ బెల్ కొడుతుంది. ముందు నుయ్యి వెనకాల గొయ్యి అంటే ఇదేనేమో అనుకుంటూ ఇద్దరు ఆలోచనలో పడుతారు. ఎపిసోడ్ అయిపోతుంది.
బ్యాక్ అండ్ ఫోర్త్.. మరో ఎపిసోడ్ మొదలు అవుతుంది. బయట డోర్ కొడుతంటాడు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ప్రకాశ్. తన వైఫ్ దగ్గరకు వెళ్తున్న అని వేణు పైకి వెళ్తాడు. తన వైఫ్ కు అన్ని చెబుతాడు. తన వైఫ్ ఏడుస్తుంది. అతి మంచితనం మంచిది కాదని, మీరు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తుంది. నేను చూసుకుంటా రిలాక్స్ అని కిందికి వస్తాడు. రాజా రవి వర్మ, సవారి ఇద్దరు మాట్లాడుకుంటారు. డోర్ తెరుస్తాడు. ఆఫీసర్ ను లోపలికి పిలుస్తాడు. పోలీసు అన్ని చూస్తూ ఆశ్చర్యపోతాడు. తనను తాను ప్రకాశ్ అని పరిచయం చేసుకుంటాడు. అంతలో ప్రకాశ్ కు ఫోన్ వస్తుంది. శవం దొరికింది అని సోఫా కింద ఉందని చెప్తాడు. కట్ చేస్తే అదే సోఫా కింద మాయను దాచిపెడుతారు. అంతలో మాయ బ్యాగ్ కనిపిస్తుంది. దాన్ని వేణు దాచిపెడతాడు. తరువాత బ్లెడ్ ప్రకాశ్ కాళ్ల వద్దకు వస్తుంది. అది చూసి సవారి టెన్షన్ పడుతాడు. తరువాత ప్రకాశ్ ను చంపేద్దామని వేణు తాడుతో ప్లాన్ చేస్తుంటాడు. అంతలో ప్రకాశ్ కు ఫోన్ వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తరువాత మాయాను ఒక క్లాత్ లో లో చుట్టి పెడుతారు. అదే సమయంలో అక్కడికి ప్రకాశ్ వస్తాడు. మర్డర్ వెపన్ ను దాచడం మీరు మరిచిపోయినట్లు వారితో చెప్తాడు. క్లాత్ ఓపెన్ చేసి చూసి అందమైన అమ్మాయిని ఎవరు చంపారు అని అడుగుతాడు. ప్రకాశ్ వాళ్లను బెదిరిస్తాడు. అసలు జరిగిన విషయాన్ని ప్రకాశ్ కు చెప్తాడు వేణు. దానికి ప్రకాశ్ నవ్వుతాడు. ఇక దీని నుంచి వారిని బయట పడేయాలంటే డీల్ సెట్ చేసుకుంటారు. దానికి ప్రకాశ్ 25 లక్షల క్యాష్ అడుగుతాడు. రాజా రవి వర్మ ఇస్తాను అని ఒక రూమ్ లోకి వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి ప్రకాశ్ కు ఇస్తాడు. అందరూ కలిసి శవాన్ని పాతిపెట్టడానికి గోతి తవ్వుతారు. అంతలో వేణు వైఫ్ బెల్ కొట్టడంతో వేణు ఇంట్లోకి వెళ్తాడు. ఆ సమయంలో శవన్ని పాతి పెట్టడానికి ట్రై చేస్తుండగా మాయా కళ్లు తెరుస్తుంది. దయ్యం అంటూ సవారి ఒక్క సారిగా అరుస్తాడు. ప్రకాశ్ నవ్వుతుంటాడు. సవారి భయపడుతుంటాడు. ప్రకాశ్ గట్టిగా నవ్వుతుంటాడు. మాయ సవారి దగ్గరకు వెళ్లి సైలెన్స్ అంటుంది.
కట్ చేస్తే సవారికి దెయ్యాల దిబ్బ గురించి చెప్పిన ఫస్ట్ సీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇద్దరు వృద్దులు సవారికి కథ చెప్పే సమయంలో ప్రకాశం, మాయ ఇద్దరు అక్కడికి వస్తారు. అదే సమయంలో సంధ్య నిలయంలో ఒకడు ఒంటరిగా తన భార్యకు సేవాలు చేసుకుంటే ఉంటాడని అతన్ని కొట్టి డబ్బులు దోబ్బాలని ప్లాన్ చేసుకుంటుంటారు టికొట్టు భద్రం ఇంకోకతను. అది ప్రకాశ్ వింటాడు. ప్రకాశం గూగుల్ చేస్తాడు. సవారికి కథ చెప్పడం మాయ వింటుంది. ఇద్దరు కాఫీ తాగుతారు. సంధ్య నిలయంలో దోచుకుందాం అని ప్లాన్ చేస్తారు. ఇక్కడ కథ మొత్తం రివీల్ అవుతుంది.
మాయ, ప్రకాశ్ ఇద్దరు కలిసి రాజా రవి వర్మ దగ్గర డబ్బులు నొక్కెయ్యడానికి దెయ్యం నాటకం ఆడుతారు. ముందుగా మాయ ఇంట్లోకి వెళ్లి అతన్ని మాటల్లో పెట్టి దోచుకోవాలని ప్లాన్ చేస్తుంది. దాన్నే ఎగ్జీగ్యూట్ చేస్తారు. కట్ చేస్తే సవారికి నిజం తెలుస్తుంది. నన్ను వదిలేయండి అని వాళ్లను బతిమలాడుతాడు. అదే సమయంలో పాతిక లక్షలు తీసుకొని ప్రకాశ్ పారిపోదాం అనుకుంటే మాయ వేరే ప్లాన్ చేస్తుంది. ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయని వాటిని కాజేయడినికి మరో ప్లాన్ చేస్తారు. తరువాతి సీన్లో కంగారు పడుతున్న తన వైఫ్ కు డబ్బులు ఇచ్చి మ్యానెజ్ చేసిన విషయాన్ని చెబుతాడు రాజా రవి వర్మ. మరో వైపు ఇంట్లో డబ్బున్న రూమ్ లో లాక్ ఓపెన్ చేయడానకి ప్రకాశ్ ట్రై చేస్తుంటాడు. ఒరిజినల్ కీ ఉంటే తప్ప లాక్ ఓపెన్ అవదు అని రాజా రవి వర్మను అడుగుదామని ఫిక్స్ అవుతారు. తన వైఫ్ కు చెప్పి కిందికి వస్తాడు వేణు. కిందికి రాగానే ఇంట్లో ప్రకాశ్ ఉంటాడు. పని అయిపోయిందా అని అడుగుతుండగా వెనకనుంచి మాయ వేణు గట్టిగా కొడుతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.
ఫ్యూ హవర్స్ బ్యాక్ తో ద కీ ఫ్యాక్టర్ అనే ఎపిసోడ్ స్టార్ అవుతుంది. మళ్లీ సీన్ మొదలైన చోటే టీ కొట్టులో మొదలు అవుతుంది. అక్కడ ఒక పిచ్చోడు టీ కోట్టు భద్రంతో సంధ్య నిలయం గురించి చెప్తాడు. ఒక్కడే ఒంటరిగా తన వైఫ్ కు సేవలు చేస్తుంటాడు అని చెప్తాడు. దాంతో టికొట్టు భద్రం కూడా డబ్బులు కొట్టెయ్యాలని ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే రాజా రవి వర్మను ఇంట్లో కట్టిపడేస్తారు. రాజా రవి వర్మను లేపి డబ్బుకోసం ఇదంతా చేసినట్లు చెప్తారు. దానికి రాజా రవి వర్మ సవారి నువ్వు కూడనా అని ఎమోషనల్ గా అడుగుతాడు. అయినా సరే ఇంకో 5 లక్షలు ఇస్తాను మొత్తం 30 లక్షలు తీసుకొని వెళ్లిపోండి అని అంటాడు.
మొత్తం దోచుకోవడానికి వచ్చామని కీ కోసం రాజా రవి వర్మను కొడుతారు. వాళ్లకు కీ దొరకదు. తన భార్యను ఎదైనా చేస్తా అని ప్రకాశ్ బెదిరించడంతో రాజా రవి వర్మ వాళ్లకు కీ ఇస్తాడు. దాంతో కీ తీసుకొని రూమ్ లోకి వెళ్తారు. అక్కడ చాలా లాకర్లు ఉంటాయి. అవి చూసి సంతోష పడుతారు. మొత్తం దొంగలించాలి అనుకుంటారు. అలా ఆశతో వెళ్లి లాకర్లు అన్ని వెతుకుతారు. ప్రతి దాంట్లో చిత్తుకాగితాలు ఉంటాయి. కొన్ని లాకార్లలో చైనులు, ఇతర వస్తువులు ఉంటాయి. దాంతో వెతికి వెతికి అలసిపోయి బయటికొచ్చి అసలు డబ్బు లేదని అడుగుతారు. తన వైఫ్ ను ఏదైనా చేస్తే డబ్బులు వస్తాయని పైకి వెళ్తారు. ఎలాగైన తన వైఫ్ ను చంపాలని రూమ్ లోకి వెళ్తారు. అక్కడ తీర చూస్తే తన వైఫ్ ఉండదు ఒక శవం ఉంటుంది. అది చూసి ప్రకాశ్, మాయ ఇద్దరు భయపడిపోతారు.
బయటకు వచ్చి ఆలోచిస్తారు. అతను ఒక సైకో అని మాట్లాడుకుంటారు. తాను రాసే బుక్స్ మీద ఉన్న నెంబర్లు లాకర్లో ఉన్నాయని, ఆ లాకర్లలో కొన్ని వస్తువులు ఉన్నాయని, ఆ వస్తువులు ఈ ఇంటికి అతిథులుగా వచ్చిన వారివి అని, వారిని అతను చంపేస్తున్నాడని మాయ ప్రకాశ్ తో చెబుతుంది. వీడి చెప్పింది కథలు కాదు అన్ని నిజాలు అని తెలుసుకుంటారు. అక్కడికి వచ్చి చూస్తే కుర్చిమీద వేణు ఉండడు. మాయ అని అరుస్తాడు. ప్రకాశ్, మాయ ఇద్దరు భయపడి ఇంట్లో బల్బులను తీసేస్తారు. ఇంటిని చీకటి చేస్తారు. ఇంకా సావారికి నిజం తెలియదు. రాజా రవి వర్మఇంకా అమయకుడు అనుకుంటాడు. ఆ చీకట్లో మాయను వెతుకుతూ రాజా రవి వర్మ వెళ్తాడు. అంతలో సవారి ప్రకాశ్, మాయలకు దొరుకుతాడు. వాళ్లు ఎంత నిజం చెప్పాలని చూస్తున్నా సవారి నమ్మడు. ఇంకా రాజా రవి వర్మ అమయకుడే అనుకుంటారు. దాంతో నిజం చూపించాడానికి తన వైఫ్ రూమ్ లోకొ వెళ్లి హయ్ చెప్పిరాపో అని పంపిస్తారు. ఆ చీకట్లో నుంచి ఒక్కసారిగా అరుచుకుంటూ సవారి పరుగెత్తుకుంటూ వస్తాడు. ముగ్గరు కలిసి పారిపోవాలను కుంటారు. దారిలో వారికి రాజా రవి వర్మ అడ్డం పడుతాడు. భయంతో పరుగెడుతుంటే మాయ జారి పడుతుంది. తనను తీసుకొని వాళ్లందరు ఒక రూమ్ లోకి వెళ్తారు. రాజా రవి వర్మ డోర్లు బద్దలు కొడుతు చేతులో కొడ్డలితో వాల్ల దగ్గరకు వస్తుంటాడు. వాళ్లను వెతుకుతూ వస్తుంటాడు. వాళ్ల మాటలు వినపడి ఒక డోర్ దగ్గరకు వచ్చి గొడ్డలతో నరుకుతాడు. అంతలో మళ్లీ డోర్ కొట్టిన సౌండ్ అవుతుంది. ఎవరా అని డోర్ తీస్తే టీ కొట్టు భద్రం తాగేసి ఇంట్లోకి వస్తాడు. విషయం తెలసుకొని ఇంటికి తాళాలు వేస్తాడు. అన్ని డోర్లు లాక్ చేస్తాడు. ఇక వాళ్లంతా ఇంట్లో ట్రాప్ అయినట్లు అనుకుంటారు. ఒకటి చంపడం లేదా చావడం అని నిర్ణయించుకుంటారు. డోర్ తీసుకొని బయటకు వస్తే భద్రం తాగిన మత్తులో వాల్లతో ఏదోదో మాట్లాడుతాడు. ఇంటికొచ్చిన వాళ్లను చంపుతూ కథలు రాసుకుంటున్నావా అని అందరు కర్రలు పట్టుకొని వేణును చంపడానికి వెల్లి ఒక రూమ్ లోకి వెళ్తారు. అన్ని వస్తువులను చూస్తూ ఒక దగ్గర అగిపోతారు, అతనే రాజరవి వర్మ వీర వర్మ అని అతను ఇంకా చావలేదు అని అనుకుంటారు. అతను దయ్యం అని సవారి చెప్తాడు. భయపడి అక్కడి నుంచి పరిగెడుతారు. అప్పుడు సవారికి ఇంట్లోకి వచ్చి మొదటి సీను నుంచి అన్ని గుర్తుకు వస్తాయి. అక్కడి నుంచి బయటకు రాగానే ఇళ్లు ఒక్క సారిగా పాతది అయిపోతుంది. వాళ్లందరూ ట్రాన్స్ లో ఉండగానే మెట్లపైన రాజరవి వర్మ కనిపిస్తాడు. వెల్ కమ్ టు మై వరల్డ్.. అనడంతో ఎపిసోడ్ ముగిస్తుంది.
అరిశద్వర్గ అనే చిరవి ఎపిసోడ్ లో పాడుబడ్డ బంగ్లాలో సవారి, ప్రకాశ్, మాయ అందరూ ఉంటారు. రాజ రవి వర్మను చూసి పారిపోతారు. ఎక్కడికి పరిగెత్తిన తిరిగి తిరిగి రాజ రవి వర్మ ముందుకే వస్తుంంటారు. ఎంత ప్రయత్నించిన తప్పించుకోరు. వారికి తన గతం చెప్తాడు.
తాను బృంద దేశానికి రాజుగా ఉండేవాడు. రాజవంశంలో పుట్టిన వీర తన తమ్ముడు. తాను చిన్నవాడు అయినందుకు తనకు అధికారం రాలేదని తనను తాను హింసించుకుంటాడు. ఈ విషయంలో మంత్రిని రాజయ్యే సలహా అడుగుతాడు వీర. కాని రాజద్రోహం చేయనను రుద్ర వెళ్లిపోతాడు. మరో సీన్లో రాజ రవి వర్మతో వ్యాపారం చేయడానికి పశ్చిమ దేశపు వ్యాపరి వచ్చినట్లు అతనితో స్నేహం చేయాలంటే.. ఇంద్రజిత్తును చంపాలని చెబుతాడు. అయితే ఇంద్రజిత్తును మెన్నపోటు పొడవాలని చెప్తాడు. ఆ పశ్చిమదేశపు రాజుతో వ్యాపార సంబంధం పెట్టుకుట్టే ఒక అందమైన అమ్మాయిని కూడా బహుమతిగా ఇస్తాడు. దానికి రాజ రవి వర్మ ఒప్పుకుంటాడు. సంధికి అని పిలిచి ఇంద్రజిత్తును చంపాలి అనేది వాళ్ల ఎత్తుగడ.
ఈ విషయం రాజు పరిచారిక సంధ్యకు నచ్చదు. రాజు ముస్తాబు చేయడానికి సంధ్యకు మనసు ఒప్పదు. ఎందుకు అని అడిగితే.. రాజు అంటే నీలా దొంగచాటుగా కాకుండా ఎదురించాలి అని, అదే మా రాజ రవి వర్మ అని చెబుతుంది. దాంతో రాజ రవి వర్మ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో ఇంద్రజిత్ తో విందు ఏర్పాటు చేస్తారు. ఇంద్రజిత్ అనుమానపడుతాడు. కాని అనుహ్యంగా అక్కడ రాజ రవి వర్మ ఒక ఎత్తు వేస్తాడు. ఆ విందులో పశ్చిమ దేశపు వ్యాపరికి విషం ఇస్తారు. మంత్రిని దేశ బహిష్కరణ చేస్తాడు రాజు రవి వర్మ. తరువాత సీన్లో సంధ్య తనను క్షమించమని అంటుంది. దానికి బదలు నన్ను పెళ్లిచేసుకో అని అంటాడు. అలా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.
ముకుంతలా రాజ రవి వర్మ ఫోటోను పొడుస్తుంది. దాసిని పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని వాల్లనాన్నతో చెప్పి ఏడుస్తుంది. ఎన్ని ఎత్తులు వేసైన సరే ఆ రాజ్యానికి రాణిని చేస్తా అని వెళ్లిపోతాడు తన తండ్రి. మరో సీన్లో మంత్రి రుద్ర, వీర, మళ్లీ, ఇంద్రజిత్ అలా అందరు ఇక చోట రహస్యమీటింగ్ పెట్టుకుంటారు. నమ్మకద్రోహంతో రాజా రవి వర్మను చంపాలని ప్లాన్ చేస్తారు. తరువాత సీన్లో రాజుపై దాడి జరుగుతుంది. ఆ దాడిలో రాజ రవి వర్మను వీర వెనుకనుంచి పొడుస్తాడు. ఆ సమయంలో సంధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు. అంతలో రాజ మరదలు సంధ్యను పొడుస్తుంది. అక్కడికి వెళ్లగానే సంధ్య రాజ చేతిలో మరణించింది. నిజానికి రాజే ఫస్ట్ చనిపోతాడు. వెంటనే ఆత్మరూపంలోని రాజా రవి వర్మ అందరిని చంపేస్తాడు.
ఎన్నో కలలలో సంతోషంగా బతాకాలి అనుకున్న తమ జీవితాన్ని మనిషిలో కామ, క్రోద, లోభ, మద, మోహ, మత్సర్యాలు చిదిమేశామని చెప్తాడు. ఈ విషయాన్ని ప్రజెంట్ లో ఈ ముగ్గురిగకి చెప్తాడు. డబ్బు మనిషిని చెడుదారిలో నడిపిస్తుందని వారికి అర్థం అయ్యేలా చెప్తాడు రాజ రవి వర్మ. పాతిక లక్షలు ఇస్తే వెళ్లిపోతారు అనుకున్నా కాని మీరు ఎక్కవ అత్యాశతో వచ్చారని అంటాడు. దానికి వాళ్లు ప్రాదేయపడుతారు. దాంతో వాళ్లను వదిలేస్తాడు. అలా ప్రాణాలకు తెగించి బయటకు వచ్చిన తరువాత మళ్లీ వాళ్లకు పాతిక లక్షలు తీసుకోవాలన్న ఆశ కలుగుతుంది మాయకు. మళ్లీ వెనక్కి వస్తారు. సవారి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ప్రకాశ్, మాయ ఇద్దరు మళ్లీ వెనక్కి వస్తారు. తీరా బ్యాగ్ చూస్తే అందులో చిత్తుకాగితాలు మత్రమే ఉంటాయి. వాల్లు నిజం తెలుసుకొని భయంతో వణికొపోతారు. ఇక రాజ రవి వర్మ వారిని క్షమించకుండా చంపెస్తాడు. కట్ చేస్తే.. సవారి లిఫ్ట్ లో ఒక కార్లో వెళుతుంటాడు. కారు డ్రైవర్ అతని ఫాలో అవర్ అని తన వీడియోలు బాగుంటాయని అందులో ముఖ్యంగా దెయ్యాలు లేవు అని చెప్పడం బాగుంటుందని అంటాడు. దాంతో సవారి దెయ్యాలు ఉన్నాయి అని అంటాడు. తరువాత మాయ తీసుకొచ్చిన బ్యాగ్, ప్రకాశ్ తనను కొట్టిన చేతి పంజాను రాజా రవి వర్మ లాకర్ లో దాచి పెడుతూ.. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అంటాడు. సిరీస్ అయిపోతుంది. ఇది అతిథి వెబ్ సిరీస్ ఫుల్ ఎక్స్ ప్లనేషన్. మా ఎక్స్ ప్లనేషన్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి. అలాగే మీరు తెలుసుకోవాలనుకుంటున్న మూవీ ఎక్స్ ప్లనేషన్ ను మాకు కామెంట్లో తెలియజేయండి.
చదవండి:Sobha ప్రైవేట్ పార్ట్స్ తాకిన యావర్.. గేమ్ ఆపివేసిన బిగ్ బాస్