Are You Ok Baby Movie Explained In Telugu | Lakshmy Ramakrishnan | Samuthirakani
Are You Ok Baby: ఓ అందమైన ఇంట్లో చిన్నపాప హాయిగా నిద్రపోతూ ఉంటుంది. పక్కనే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ఉంటుంది. అక్కడికి బాలన్ వచ్చి పాప నిద్రపోయిందా అని తన భార్య విద్యాను అడుగుతాడు. పాపకు ఏదైనా పేరు ఆలోచించావా అని అంటే ఇద్దరిపేర్లను కలిపి ఆన్యగా పెట్టినట్లు చెప్తుంది. దాంతో అన్య తల్లి అని పిలుస్తూ.. పాపను ముద్దు చేస్తుంటాడు బాలన్. అంతలో చేతులో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ను చూపిస్తూ సంతోషపడుతుంది. అది చూసి బాలన్ కూడా ఆనంద పడుతాడు. అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. బయటకు వెళ్లి మాట్లాడుతాడు బాలన్. ఫోన్లో ఉన్న లేడీ రూబీ అని తనకు 50 వేలు అవసరం ఉందని, దుబాయ్ విసా ఓకే అయిందని చెప్తుంది. మనీ అరెంజ్ చేస్తాను కానీ, నాకెప్పుడు ఫోన్ చేయకు అని బాలన్ అంటాడు. మీకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను అని రూబీ అనగానే కోపంతో ఫోన్ పగలగొడుతాడు బాలన్. అక్కడికి విద్యా కంగారుగా వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదని తనను దగ్గరకు తీసుకుంటాడు బాలన్.
చదవండి:Sarath Marar: దూత వెబ్ సిరీస్ కోసం 300 పైగా ట్యాంకర్లకు నీటిని వాడాము!
ఏరియల్ షాట్‌తో ఊరును చూపిస్తారు. పాపకు ఊయ్యల్లో వేస్తూ ఆడిస్తుంటారు. సాంగ్ మొదలౌతుంది. పాపను ఆడిస్తుంటారు. స్నానం చేయిస్తారు. తనకు చిన్న కృష్ణుడి గెటప్ వేసి అల్లరుముద్దుగా చూసుకుంటారు. పాపకు ఇంజక్షన్ వేసేప్పుడు విద్యా, బాలన్ ఇద్దరూ బాధ పడుతుంటారు. అలా పాట ముగుస్తుంది. తరువాత సీన్లో విద్యా పాపకు ఫుడ్ తీసుకొని వస్తుంది. అదే సమయంలో ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేస్తుంది విద్యా. ఎవరు మాట్లాడరు. ఫోన్ పెట్టేస్తుంది. తరువాత పాపకోసం ఇంటిని డిజైన్ చేస్తుంటారు. అన్య త్వరలో నడుస్తుందని చైల్డ్ గేట్ పెట్టమని చెప్తుంది. పాపకు ఫుడ్ తినిపిస్తుంది. మళ్లీ ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే బతుకు ఎండ్లబండి నుంచి ఫోన్ చేస్తున్నామని తాను యాంకర్ రష్మి రామకృష్ణన్ అని చెప్తుంది. ఒక ఫ్యామిలీ దగ్గర నుంచి పాపను తీసుకెళ్లారని ఆ కుటుంబం ఆ షోకు వచ్చినట్లు చెప్తుంది. దాంతో మాకు ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకండి మేడమ్ అని విద్యా అంటుంది. అలాంటప్పుడు లీగల్‌గా అడాప్ట చేసుకోవాల్సింది అని యాంకర్ అంటుంది.
తరువాత సీన్లో స్టూడియోలో లైట్స్ ఆన్ అని డైరెక్టర్.. ఆర్ట్ డిపార్ట్ మీద అరుస్తుంటాడు. డిస్ ప్లే ఛేంజ్ చేయమని అరుస్తాడు. నెక్ట్స్ డ్రైవర్ కు ఫోన్ చేసి త్వరగా రండీ లేదంటే నేను వెళ్లిపోతా అని కోప్పడుతాడు. కట్ చేస్తే రష్మీ రామకృష్ణన్ కు ఫోన్ చేస్తాడు అసిస్టేంట్. తాను వస్తున్నా అని అంటుంది. తనతో ఫోన్ మాట్లాడిన పర్సన్స్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి వెళ్తారు. అక్కడి ఆఫీసర్స్ తో మీటింగ్ లో పాల్గోంటారు. ఇలాంటి కేసును మీరెందుకు హ్యాండిల్ చేస్తున్నారు సీడబ్ల్యూసీకి ఇవ్వచ్చుగా అని అక్కడి అధికారి అడుగుతాడు. షో అయిపో వచ్చింది అని, శోభకు న్యాయం చేయాలని రమ్య బదులిస్తుంది. తాను ఛానెల్ లిగల్ అడ్వైజర్ అని పరిచయం చేసుకుంటుంది. తాను ఏజ్ చాలా చిన్నదే అని సీడబ్ల్యూసీ మెంబర్ మిష్కిన్ అంటాడు. తరువాత రమ్య చెబుతూ.. మేడమ్ ఊర్లో లేదు అందుకే రాలేదు అని మిగిలిన ఇద్దరిని పరిచయం చేయబోతే వాళ్లు తెలుసు ప్రతి నెల వస్తుంటారు అని అంటాడు మిష్కిన్. స్టోరీ టెలికాస్ట్ చేసి ఫాలో అప్ లో ఉండాలి అని శోభ ఇచ్చిన కంప్లైంట్ చూడండి అని డాక్యుమెంట్స్ ఇస్తాడు. షో డీవీడీ తీసుకొని నెక్ట్స్ టైమ్ యాంకర్ రావాలని చెప్పి వాళ్లన వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. వాళ్లు వెళ్లిపోతారు.
తరువాత అక్కడికి మరో వ్యక్తి వచ్చి వాళ్లతో మాట్లాడుతాడు. తను వెళ్లిపో అంటే చెకోడి ప్యాకెట్లకు ఇచ్చిన 300 తీసుకొని వెళ్లి బయటన మరో వ్యక్తిపై అరుస్తాడు. మిష్కిన్ తన టీమ్ మెంబర్స్ తో మాట్లాడుతూ.. ఇది చైల్డ్ ట్రాఫికింగ్ లా ఉందని పోలీసులకు కంప్లైంట్ చేయాలని అంటాడు.
తరువాత సీన్లో శోభకు ఫోన్ వస్తుంది. సీడబ్ల్యూసీ నుంచి ఫోన్ చేస్తున్నామని బిడ్డకోసం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేయబోతున్నట్లు చెప్తుంది. వెంటనే బయలు దేరి రావల్సిందిగా చెప్పడంతో శోభ లోకేషన్ షేర్ చేయమని అడుగుతుంది.
నెక్ట్స్ సీన్లో రియాల్టీషోలో పాల్గొన్న శోభకు తన బిడ్డను ఇప్పించడానికి సిడబ్ల్యూసీ ప్రయత్నిస్తున్నట్లు న్యూస్ లో యాంకర్ చెప్తుంది. ఈ షోకు సంబంధించిన వ్యక్తులను హాజారు కావాలని సీబీ సీఐడీ సమన్లు పంపించిందని చెప్పే వాయిస్ మీదుగా ఒక సీఐడీ ఆఫీసర్ వస్తాడు. అక్కడే శోభ తన మామతో ఉంటుంది. ఆఫీసర్ తో మాట్లాడుతుంటారు. నా పరిస్థితి తెలిసే.. వారు నా బిడ్డను తీసుకెళ్లారు అని శోభ చెప్తుంది. బిడ్డను ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎందుకు ఇచ్చావు అని సీఐడీ ఆఫీసర్ అడుగుతాడు.
కట్ చేస్తే శోభ తన యాయ్ ఫ్రెండ్ తో బిల్డింగ్ పై ఉంటుంది. శోభతో క్లోజ్ గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంటాడు. వాచ్ మెన్ చూస్తాడు అని శోభ చెప్తుంది. నా వైఫ్ నా ఇష్టం అని.. నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గమీద సొట్ట చాలా బాగుంటుందిని తనతో క్లోజ్ గా మాట్లాడుతాడు. కట్ చేస్తే తెల్లారిపోతుంది. ఇద్దరు పైనే నిద్రపోతూ ఉంటారు. తరువాత సీన్లో చెన్నై కామక్షీ ఆసుపత్రిలో శోభ నర్సుతో మాట్లాడుతుంది. తనకు నాలుగో నెల అని అబార్షన్ చేయడం కుదరదు అంటున్నారని ఏడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎలా జాబ్ చేయగలను, రూమ్ రెంట్, ఇంటికి డబ్బులు పంపాలి, తినడానికి కూడా ఇబ్బందే అని అంటుండగా.. ఎందుకు అలా ఏడుస్తావు… నువ్వు వీక్ గా ఉన్నావు అని నర్సు సుగుణ అంటుంది. ఓ పని చేయి బిడ్డను కనీ, లేని వాళ్లకు ఇవ్వు అని అంటుంది. ఒప్పుకుంటే ఆ ఏర్పాట్లు నేను చూస్తా అని నర్సు చెప్తుంది. దాంతో శోభ సైలెంట్ అవుతుంది. తరువాత సీన్లో బిల్డింగ్ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. తరువా తన బాయ్ ఫ్రెండ్ త్యాగ్ వచ్చి డూటీకి వెళ్లలేదా అని అడుగుతాడు. వెళ్లలేదు ఇలా ప్రెగ్నెంట్ తో ఎలా వెళ్లాలి అంటోంది. త్యాగ్ డబ్బులు అడుగుతాడు. శోభ లేవు అంటుంది. దాంతో చిరాకుగ అన్ని వెతికి డబ్బులు తీసుకొని శోభను నెట్టేసి తాగడానికి వెళ్తాడు.
తరువాత సీన్లో శోభకు నొప్పులు రావడంతో తనను తీసుకొని ఆసపత్రికి తీసుకెళ్తుంది నర్సు. కట్ చేస్తే శోభకు ఆకలివేస్తుందని నర్సు సుగుణ ఇచ్చిన భోజనం తింటుంది. తినేప్పుడు పాప ఏడుపు వినిపిస్తుంది. దాంతో పాపను చూడాలి ఆశగా ఉందని చెప్తుంది శోభ. నర్సు ఒప్పుకోదు. ఇప్పటికే వాళ్లు పాపకు 2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా ఎంత అవుతుందో తెలియదు అని నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్తుంది. దాంతో శోభ బాధ పడుతుంది. తన భర్త ఒట్టి తాగుబోతు అని అంటుంది. తరువాత సీన్లో శోభ, తన భర్తతో కలిసి నర్సు ఇంట్లో కూర్చొని మాట్లాడుతారు. తనకు బిడ్డను చూడాలని ఉందని చెప్తుంది. భర్త మాత్రం డబ్బులు లెక్కపెడుతుంటాడు. ఇద్దరు కలిసి సైన్ చేస్తారు. ఇదే విషయాన్ని సీఐడీతో చెప్తుంది. తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి మీడియాకు వెళ్లినట్లు చెప్తుంది. దాంతో ఈ విషయాన్ని సీడబ్ల్యూసీకి తీసుకువెళ్లింది ఎవరు అని అడుగుతాడు ఆఫీసర్.
కట్ చేస్తే శోభకు ఫోన్ వస్తుంది. ఓ మీడియా ఛానెల్ నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి తాను చెప్పినట్లు వింటే బిడ్డ దక్కుతుంది. బిడ్డను పెంచడానికి డబ్బులు కూడా ఇప్పిస్తామని చెప్పినట్లు సీఐడీతో చెప్తుంది. ఈ అమ్మాయి తప్పుల మీద తప్పులు చేస్తుంది సర్ అని వాళ్ల మామ అంటాడు. ఎలా సర్ ఈ అమ్మాయిని మా కుటుంబంలో చేర్చుకోవాలి అని అడుగుతాడు. శోభ ఏడుస్తూ ఎలాగైనా నా బిడ్డ నాకు కావాలి.. ఇప్పించండి సర్ అని అడుగుతుంది. ఇక మీద ఎలాంటి తప్పు చేయను అని అంటుంది. తరువాత సీన్లో బాలన్ పాపతో ఆడుకుంటూ ఉంటాడు. తనకు లాయర్ ఫోన్ చేస్తుంది. శోభ కంప్లైంట్ ఇచ్చిందని మనం బెయిల్ కు అప్లై చేయాలిని చెప్తుంది. బాలన్ టెన్షన్ పడుతాడు. తరువాత సీన్లో సీఐడీ ఆఫీసర్ న్యూస్ ఛానెల్ కు వెళ్తాడు. అక్కడి రమ్య వచ్చి ఛానెల్ ను చూపిస్తుంది. తరువాత షో జరుగుతుందని అక్కడికి ఆఫీసర్ వెళ్తాడు. అక్కడ లూడో గేమ్ కోసం కొట్టుకున్న భార్యభర్తలతో షో నడుస్తుంది. దానికి డైరెక్టర్ చిరాకు పడుతుంటాడు. తరువాత అతను ఓ మర్డర్ చేసి జైల్ లోకి వెళ్లినట్లు చెప్తాడు. ఎలా నరుకుతావు అని యాంకర్ అడిగితే.. చేతితోనే అని ఏ నరికి చూపించమంటావా అని అంటాడు. దాంతో అందరు నవ్వుతారు. తరువాత అక్కడి నుంచి సీఐడీ ఆఫీసర్ వెళ్లి కాన్ఫరెన్స్ హాల్ లో కూర్చొంటాడు. హార్డ్ డిస్క్ ఇస్తాడు డైరెక్టర్. అసలు ఈ ఎపిసోడ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మొత్తం డిటైల్స్ కావాలి అని అడుగుతాడు ఆఫీసర్.
కట్ చేస్తే న్యూస్ ఛానెల్ కు రష్మిక రామకృష్ణన్ వస్తుంది. అక్కడ చాలా మంది ఉంటారు వారందరితో మాట్లాడుతూ లోపలికి వస్తుంది. అక్కడ శోభ ఉంటుంది. రష్మిక కాళ్ల మీద పడి తనకు తన బిడ్డను ఇప్పించమని బ్రతిమిలాడుతుంది. తన కేసు గురించి అడిగుతుంది. నర్సు డిటైల్స్ ఇస్తాడు తన అసిస్టెంట్.. తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. అదే సమయంలో షూటింగ్ టైమ్ అయింది. డైరెక్టర్ అరుస్తున్నాడు అని ఓ వ్యక్తి చెప్తాడు. నెక్ట్స్ సీన్లో రష్మిక తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తుంటే ఫోన్ వస్తుంది. ఎవరు నాకు ఫోన్ చేసింది అని నర్సు అంటుంది. మాట్లాడేది సుగుణేనా అంటుంది రష్మిక. స్టూడియోకు రా అని యాంకర్ చెప్తుంది. తరువాత సీన్లో సుగుణ టీవీ ఛానెల్ కు వెళ్తుంది. అక్కడ శోభ కనిపిస్తుంది. భయంతో సుగుణ వచ్చిన ఆటోలోనే వెళ్తుంది. అదే సమయంలో అడ్డుకోబోయిన ఒక పర్సన్ కింద పడుతాడు. అదే సమయంలో యాంకర్ రష్మిక వస్తుంది. తనతో సుగుణ పారిపోయిన విషయాన్ని చెప్తారు. సుగుణను వెతకాడానికి కార్లో వెళుతారు రష్మిక అండ్ టీమ్. అన్ని చోట్ల వెతుకుతారు. తరువాత సీన్లో ఇంట్లో సుగుణ భర్త బతుకు ఎండ్లబండి షో చూసుకుంటూ నవ్వుతుంటాడు. అదే సమయంలో యాంకర్ ఇంటికి వచ్చి సుగుణతో మాట్లాడాలి అంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. తరువాత సుగుణకు కాల్ చేస్తాడు. సుగుణ టీ తాగుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నన్ను చూడకుండానే వెళ్లిపోయావు అని అడుగుతుంది యాంకర్. తరువాత నర్సు ఏదో చెప్తుంది. సరే మనం కలుద్దాం అని చెప్తుంది. తరువాత సీన్లో యాంకర్ రష్మి, నర్సు సుగుణ కార్లో కూర్చొని మాట్లాడుతారు. శోభ పరిస్థితి గురించి చెప్తుంది. తనకు దానికి ఏం సంబంధం లేదు అని రుబీకి తెలుసు అని చెప్తుంది సుగుణ. ఇప్పుడ రూబీ దుబాయ్ వెళ్లిపోయింది అని అంటుంది.
కట్ చేస్తే శోభ భర్తను స్టూడీయోకు తీసుకొస్తారు ఛానెల్ టీమ్. తన భార్య గురించి చెప్పమని అడుగుతారు. షోకి వెళ్తాడు. అక్కడికి వాళ్ల నాన్న కూడా వస్తాడు. త్యాగ్ మంచి డ్యాన్సర్ అని ఒక పాట వేయండి డ్యాన్స్ చేస్తాడు అని యాంకర్ అంటుంది. క్లాసికల్ సాంగ్ వేస్తారు. షూ విప్పేసీ డ్యాన్స్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అక్కడికి శోభ వస్తుంది. త్యాగ్ డ్యాన్స్ ఆపేసి చూస్తుంటాడు. కూర్చొ అని చెప్తుంది యాంకర్. త్యాగ్ కూర్చొగానే శోభ ఎదురుగా వెళ్లి కూర్చుంటుంది. బిడ్డను అమ్మెశాడు అని శోభ చెప్తుంది. అయితే వాళ్లకు పెళ్లి కాలేదని ఆరు సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారని, అలానే వారికి బిడ్డపుట్టింది అని చెప్తుంది. దాంతో రష్మి బాలన్ ఇంటికి ఫోన్ చేస్తుంది. అక్కడ విద్యా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వినపడకపోవడంతో కాల్ కట్ అవుతుంది. తరువాత మళ్లీ కాల్ చేస్తారు. అప్పుడు విద్యా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వాళ్ల షోకు ఒక కుటుంబం వచ్చిందని, వాళ్ల బిడ్డ వాళ్లకు కావాలని చెప్తుంది. దాంతో మాకు ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకండి అని విద్యా అంటుంది. తరువాత శోభ మాట్లాడుతూ తన బిడ్డ కావాలి అని అంటుంది. మేము అన్ని లీగల్ గానే అడాప్ట్ చేసుకున్నామని, అన్ని వాళ్ల భర్తతో మాట్లాడమని చెప్తుంది విద్యా. దాంతో ఎపిసోడ్ కంటిన్యూ చేయండి టీఆర్పీ వస్తుందని పీసీఆర్ నుంచి డైరెక్టర్ చెప్తాడు. బాలన్ తో మాట్లాడుంది యాంకర్. తాను అన్ని ఫ్రూప్స్ ఉన్నాయని చెప్తాడు. మీ అడప్షన్ చెల్లదు అని యాంకర్ చెప్తుంది. బాలన్ షాక్ లో ఉంటాడు. ఈ షో చాలా పాపులర్ అవుతుంది.
తరువాత సీన్లో సీఐడీ ఆఫీసర్ తో లిఫ్ట్ లో వెళ్తారు యాంకర్ అండ్ టీమ్. డైరెక్టర్ కోపంగా ఉంటాడు. సీఐడీ ఆఫీసర్ వెళ్లిన తరువాత యాంకర్ చెప్పినట్లు చేస్తే ఇలాంటిి ప్రాబ్లమ్ వచ్చుండేది కాదు అని డైరెక్టర్ అంటాడు. ఇది నా షో అని మాట్లాడుతాడు. దీంతో మీరు వేరే యాంకర్ ను చూసుకోండి అని రష్మి అంటుంది. అతను ఎవరితోనైనా చేయగలను, ఈ ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ను పెట్టి కూడా చేయగలను అంటాడు. దాంతో రష్మి కోపంతో వెళ్లిపోతా అంటుంది. టీమ్ అంతా తనను కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. కట్ చేస్తే అడాప్షన్ డీల్ మీద సైన్ చేశావా అని శోభను అడుగుతుంది యాంకర్. దానికి అవును అని అంటుంది. అలాగే తనకు 5 సార్లు అబార్షన్ అయిందని త్యాగ్ చెప్తాడు. దాంతో భార్య భర్తలు ఇద్దరు తిట్టుకుంటారు. వీరు బిడ్డను పెంచలేరు, వీళ్లు సరిగా లేరు అని యాంకర్ మాట్లాడుతుంది. డైరెక్టర్ అలా మాట్లాడకండి అని చెప్పినా సరే యాంకర్ వాళ్లను తిడుతుంది. త్యాగ్ కాళ్లను పట్టుకుంటుంది శోభ. తనను పక్కకు నెట్టి త్యాగ్ వెళ్లిపోతాడు. శోభ ఏడుస్తుంది. ఆడప్షన్ అనేది చాలా గొప్పది, కాని అది చాలా ప్రాపర్ గా జరుగాలని లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అని చెప్పి యాంకర్ కూడా వెళ్లిపోతుంది. శోభ అలానే ఏడుస్తుంది. డైరెక్టర్ యాంకర్ ను తిడుతాడు దాన్ని ఒకడు షూట్ చేసి ఛానెల్ ఏండీకి చూపిస్తాడు. దాంతో అతని విషయం నేను చూసుకుంటా ని అనిచెప్తాడు ఎండీ.
తరువాత సీన్లో సుగుణ కోసం సీఐడీ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్లను అడిగితే సుగుణ వాళ్లు దుబాయ్ వెళ్లిపోయారు అని చెప్తారు. అదే విషయాన్ని మిష్కన్ తో ఫోన్ చేసి చెప్తాడు. ఇది చాలా సెన్సిటీవ్ కేసు అని మిగితా కేసుళ్లా కాదు అని అంటాడు. తరువాత సీన్లో బాలన్ ఇంటికి సీఐడీ ఆఫీసర్ వస్తాడు. పాపను బయట గార్డెన్ లో తిప్పుతుంది బాలన్ తల్లి. తరువాత వాళ్లతో బిడ్డ అడప్షన్ గురించి మాట్లాడుతాడు. లాస్ట్ ఈయర్ వాళ్లకు రూబీ అనే నర్సు పరిచయం అయింది అని, ఈ బిడ్డను రూబీనే ఏర్పాట్లు చేసిందని, ప్రాపర్ లీగల్ గానే బేబీని అడాప్ట్ చేసుకున్నట్లు చెప్తారు. దానికి సీఐడీ ఆఫీసర్ ఇది లీగల్ కాదు చిల్డ్రన్ ట్రాఫిక్ కిందకు వస్తుందని చెప్తాడు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. సఐడీ ఆఫీసర్ వెళ్లిపోతుంటే శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూపిస్తారు. రేపు బేబీని హోం కేర్ వాళ్లకు అప్పగించాలి అని చెప్తాడు ఆఫీసర్. తరువాత బాలన్, విద్యా బాధ పడుతుంటారు.
తరువాత సీన్లో పాప వస్తువులన్నింటిని బ్యాగ్ లో పెట్టి పాప పక్కనే కూర్చొని ఏడుస్తుంది విద్యా. అది బాలన్ చూసి కూడా ఏడుస్తాడు. పాప దగ్గరకు వచ్చి బాలన్ తల్లి కూడా ఏడుస్తుంది. పాపను తీసుకుపోవడానికి సీడబ్ల్యూసీ మెంబర్స్ వస్తారు. తీసుకొని వెళ్లిపోతారు. తరువాత సీన్లో సీఐడీ ఆఫీసర్ కు బాలన్ లాయర్ ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్లు పాపను చూడోచ్చా అంటే లేదు అని చెప్తాడు. తరువాత సీన్లో పాప రిపోర్ట్ చూస్తారు. అన్ని బాగున్నాయి అని అంటారు. తరువాత సీన్లో శోభ రెడీ అయి తన బిడ్డకోసం చిల్డ్రన్ హోంకు వెళ్లి తన కూతుర్ని ఎత్తుకొని ఏడుస్తుంది. తరువాత తన బిడ్డకోసం బొమ్మలను చూస్తుంది. ఒక బొమ్మ కొనుక్కొని వెళ్లి బీచ్ లో కూర్చుంటుంది. నెక్ట్స్ సీన్లో విద్యా బాధ పడుతూ ఉంటుంది. బాలన్ ఫోన్లో పాప రీల్స్ చూస్తూ ఉంటాడు. తరువాత లాయర్ కు ఫోన్ చేసి ఎలాగైనా పాప కావాలి అని అంటాడు. చాలా సీరియస్ కేసులు వేశారు. అవి నిజం అని తేలితే మినిమమ్ పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని లాయర్ గీతా గోపినాథ్ చెప్తుంది.
మరో సీన్లో సీఐడీ ఆఫీసర్ తో లాయర్ మాట్లాడుతుంటాడు. క్వాష్ పిటిషన్ గురించి అడుగుతాడు. బాలన్, విద్యా తో కలసి త్యాగు కూడా కేసును కొట్టేయని సంతకం పెట్టాడు అని లాయర్ అంటాడు. ఈ కేసులో శోభను చూస్తే జాలీ వేస్తుందని ఆఫీసర్ అంటాడు. తాను కూడా డబ్బులు తీసుకోవడంతో తనను కూడా ఏ4 గా చేర్చాలని లాయర్ మాట్లాడుతాడు. ఇక కేసులో ఇద్దరు నర్సులు దుబాయ్ కి వెళ్లిపోయారు అని చెప్తాడు. తరువాతి సీన్లో పాప అన్యను కేర్ టేకర్ ఆడిస్తుంది. అక్కడికి శోభ వచ్చి వేయిట్ చేస్తుంది. పాపను చూడాడానికి పర్మిషన్ లేదు అని అక్కడి పనిచేసే అవిడ చెప్తుంది. పిల్లలు అంతా చక్కగా ఆడుకుంటుంటారు. అన్యా మాత్రం ఏడుస్తుంది.
శోభ కూడా అక్కడే ఉంటుంది. పాపకు జ్వరం వచ్చిందని నర్సు చెపితే శోభ బాధపడుతుంది. తరువాత సీన్లో బాలన్, విద్యా అక్కడికి వెళ్తారు. ఆఫీసర్స్ తో మాట్లాడుతారు. ఒక్కసారి అన్యను చూడాలిని ఉందని విద్యా ఏడుస్తుంది. వాళ్లు కుదరదు అని చెప్తారు. అంతలో అక్కడ శోభ కనిపిస్తుంది. తన దగ్గరకు విద్యా వెళ్లి ఏందుకు మాకు బిడ్డను ఇచ్చావు అని, ఇప్పుడు అన్య లేకుండా ఉండలేకపోతున్నాము అని ఏడుస్తుంది. దానికి నా బిడ్డను ఎవరికి ఇవ్వను అని శోభ అంటుంది. అక్కడినుంచి బాలన్, విద్యా కార్లో వెళ్లిపోతారు. వారికి లాయర్ ఫోన్ చేసి అక్కడికి ఎందుకు వెళ్లారు అని కొప్పడుతుంది. తరువాత హీయరింగ్ కు మీ ఇద్దరు హాజరు కావాలని చెబుతుంది.
మరో సీన్లో శోభ బీచ్ లో ఒంటరిగా కూర్చుంటుంది. బాలన్, విద్య వెళ్లిపోయాక అక్కడి ఆఫీసర్లు నీ బిడ్డను తెలిసే కదా ఇచ్చావు. ఇక మీదుట నీకు ఇవ్వరు, వాళ్లకు ఇవ్వరు అని చెప్తాడు. దాంతో శోభ షాక్ అవుతుంది. అదే తలుచుకొని బాధ పడుతుంది. అక్కడి నుంచి వెల్లి ప్రేయర్ చేస్తుంది. తరువాత కోర్టులో కేసు జరుగుతుంది. అక్కడ బాలన్, విద్యా, త్యాగ్, వాల్ల నాన్న, శోభ ఉంటారు. వారిని పిలుస్తారు జడ్జ్. వారి తరఫున లాయర్లు మాట్లాడుతారు. పాపను పెంచడం వీలుపడకనే వారు ఆ బిడ్డను బాలన్ దంపతులకు ఇచ్చారు అని కౌన్సిల్ లాయర్ గీతా గోపినాథ్ అంటారు. అలాగే శోభ కుటుంబం పేదది అని, తన బిడ్డను పెంచలేని పరిస్థితి ఉందని.. అలాగే శోభ ఇది వరకు 5 సార్లు అబార్షన్ కూడా చేయించుకుందని అంటుంది. దీంతో జడ్జ్ ఆబ్జెక్షన్ చెప్తాడు. తన పర్సనల్ విషయాల గురించి అవసరం లేదని, కేసుకు సంబంధించిన విషయాలనే చెప్పమని మందలిస్తాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ శోభకు పరిస్థితిన చూసే వాల్లు తన బిడ్డను లాక్కున్నారని చెప్తాడు. ఇక బాలన్ మాట్లాడుతూ.. అన్ని ఉన్నా 15 సంవత్సరాలుగా పిల్లల కోసం చాలా ప్రయత్నం చేశామని, లక్కీగా తమ దగ్గరకు అన్య వచ్చిందని, తనకోసం విద్యా జాబ్ మానేసిందని, ఇక నాచురల్ మదర్ ఫీడింగ్ ఇస్తుందని చెప్తాడు. దానికి జడ్జ్ షాక్ అవుతాడు. అది ఏలా అంటే లేటెస్ట్ టెక్నాలజీతో బిడ్డ ఎదుగుదల కోసం ఇలా తల్లిపాలనే ఇస్తుందని అని చెప్తాడు.
బిడ్డను ఇవ్వడానికి నీకు డబ్బులు ఇచ్చారా అని శోభను జడ్జ్ అడుగుతాడు. దానికి లేదు అని చెప్తుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తన దగ్గర కన్నా వాల్లదగ్గరే బిడ్డ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. మధ్యలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పించుకొని శోభ ఇలా మాట మారుస్తుంది. ఆ బిడ్డ ఎవరికి దక్కకూడదు అంటాడు. తరువాత జడ్జ్ మాట్లాడుతూ ఈ కేసులో శోభ మాటలను కోర్టుకు అఫిడవిటీగా ఇవ్వండి అని చెప్తాడు. తరువాత లాయర్ గీతా గోపినాథ్ బాలన్, విద్యాను ఇంటికి వెళ్లండి అని చెబుతుంది. శోభ ఇచ్చిన అఫిడవిటీని కోర్టు ముందు చదివి వినిపిస్తుంది. తన ఇష్టంతోటే అన్యను వాల్లకు ఇచ్చింది అని చెప్పడంతో పాపను బాలన్ విద్యలకే ఇవ్వాల్సిందిగా తీర్పు చెప్తాడు జడ్జ్.
ఇదే విషయం యాంకర్ రష్మి రామకృష్ణన్ తెలిసి బాధ పడుతుంది. ఇంటికి వెళ్లి బాధతో కూర్చుంటుంది. తన హస్బెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుంది. తను సీఐడీ ఆఫీసర్ తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతుంది. ఈ కేసులో అన్య హోం కేర్ లో పెరగడం కన్నా బాలన్ దగ్గర ఉంటేనే బాగుంటుందని సైలెంట్ గా ఉన్నట్లు చెప్తాడు. ఇక నర్సు సుగుణ, రుబీలను విడిచిపెట్టేది లేదని చెప్తాడు. కట్ చేస్తే బాలన్, విద్యా సంతోషంగా హోం కేర్ వెళ్లి అన్యను తీసుకుంటారు. ఇది ఆర్ యూ ఓకే బేబీ మూవీ.