Annapurna Photo Studio Review: అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ రివ్యూ
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు చైతన్య రావు హీరోగా తెలుగు నటి లావణ్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్ర అన్నపూర్ణ స్టూడియో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూసేయండి.
చిత్రం: అన్నపూర్ణ ఫోటో స్టూడియో నటీనటులు: చైతన్యరావు, లావణ్య, మిహిర, ఉత్తర, వైవ రాఘవ, లలిత్ ఆదిత్య, యష్ రంగినేని తదితరులు దర్శకుడు: చందు ముద్దు నిర్మాత: యష్ రంగినేని సినిమాటోగ్రఫి: పంకజ్ తొట్టాడా సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఎడిటర్: డి వెంకట్ ప్రభు విడుదల: 21-07-2023
Annapurna Photo Studio Review: పిరియాడిక్ కథ నేపథ్యంలో మంచి లవ్ స్టోరితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపోందించిన తాజా చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో(Annapurna Photo Studio). సినిమా మొదటినుంచి ఇదే విషయంతో పబ్లిసిటీ చేస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో ఈ సినిమా ఏ మేరకు అలరించిందో ఈ రివ్వ్యూలో చూద్దాం.
కథ
1980లో గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అందమైన పల్లెటూరిలో చంటి (చైతన్య రావ్) తన స్నేహితుడితో కలిసి తల్లి పేరు మీద అన్నపూర్ణ ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. జ్యోతిష్యుడైన తన తండ్రికి చుట్టు పక్కల ఎంతో మంచి పేరు ఉంటుంది. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాకపోవడంతో స్నేహితులంతా ఎగతాళి చేస్తుంటారు. (Annapurna photo studio movie review) ఇంతలోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్టపడుతుంది. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో తండ్రికి తెలసి.. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌతమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చంటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నించాడు? ఇంతకీ చంటి, గౌతమి ఒక్కటయ్యారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
స్వచ్ఛమైన ఓ పల్లెటూరి ప్రేమకథ ఇది. ఆ రోజుల్లో మనుషుల్లోని అమాయకత్వం, కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్.. వినసొంపైన సంగీతంతో 80ల కాలాన్ని తెరపై డైరెక్టర్ ఆవిష్కరించిన తీరు మనసుల్ని హత్తుకుంటుంది. కేవలం ప్రేమకథే కాదు.. ఇందులో ఓ మంచి థ్రిల్లింగ్ అంశం కూడా ఉంటుంది. (Annapurna photo studio movie review) పెళ్లికాని ప్రసాద్ అని స్నేహితులు ఏడిపించినా సరదాగా తీసుకునే హీరో హత్యలు చేయాలనే నిర్ణయానికి రావడం ప్రేక్షకుడిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా కథానాయకుడి పెళ్లి కష్టాలు, నాయికతో ప్రేమాయణం, స్నేహితుల హంగామా బాగా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో క్రైమ్ ఎలిమెంట్స్ ఉండటంతో హాస్యం మోతాదు తగ్గినట్టు అనిపిస్తుంది. (Annapurna photo studio movie review) సాంకేతికతతో కలుషితం కాని పాత రోజుల్లోకి వెళ్లి ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల్ని ఈ సినిమా బాగా మెప్పిస్తుంది. వినసొంపైన పాటలు, హాయిని పంచే లొకేషన్లు సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. కాపోతే కొంచెం నెమ్మదిగా కథ సాగుతుంది అని పిస్తుంది.
ఎవరెలా చేశారు
వెబ్ సిరీస్ లతో ప్రూవ్ చేసుకున్న చైతన్యరావ్ తన నటన మెప్పించాడు. వయసు మీదపడిన కుర్రాడిగా తనకి అలవాటైన పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు, గోదావరి యాస, కామెడీలో టైమింగ్ ఆకట్టుకుంటుంది. లావణ్య అచ్చమైన తెలుగమ్మాయిగా అందంగా కనిపించింది. ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. (Annapurna photo studio movie review) చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర, స్నేహితుడిగా లలిత్ ఆదిత్య, మరో పాత్రలో మిహిరా మంచి అభినయం ప్రదర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ కనిపించే వైవా రాఘవ పాత్ర కూడా బాగా నవ్విస్తుంది. నిర్మాత యష్ రంగినేని కథని మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో కనిపించారు. పతాక సన్నివేశాల్లో ఆయన పాత్ర, నటన సినిమాకి కీలకం. కొత్త నటులతో దర్శకుడు సహజమైన నటనని రాబట్టుకున్నారు. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. పల్లెటూరి అందాల్ని తెరపై ఆవిష్కరించిన తీరు శభాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. కథలో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. దర్శకుడు చెందు ముద్దు తాను అనుకున్న కథని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో విజయం సాధించారు. ఉంది.