»Anchor Anasuya Emotional On Stage Over Rangamarthanda Movie
Anchor Anasuya Emotional: కంటతడి పెట్టిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కోడలిగా కనిపిస్తున్నారు అనసూయ (anasuya pressmeet). ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనసూయ, కృష్ణవంశీ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడారు. దర్శకుడి వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించి, భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సినిమా ఫైనల్ కాపీ (Rangamarthanda Movie emotional family drama a classic) చూసిన తనకు కన్నీళ్లు వచ్చాయని (anasuya Emotional), ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తాను కంగారు పడి పలుమార్లు దర్శకులు కృష్ణవంశీకి ఫోన్ చేసే దానిని అని గుర్తు చేసుకున్నారు (anasuya bharadwaj) . సర్ ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదేమిటి అని అడగ్గా… అందుకు ఆయన మన సినిమా మాట్లాడుతుందని సమాధానం ఇచ్చే వారని తెలిపారు. ఇప్పుడు ఈ క్షణం చాలా ఎమోషనల్ గా ఉందని, రంగమార్తాండ వంటి మంచి సినిమాలో తాను భాగస్వామ్యం అయ్యానని, ఇది తన జీవితానికి చాలు అన్నారు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశానని, సినిమాలో నటించాను కదా.. కాబట్టి అంతగా ఎమోషనల్ కానులే అని భావించానని, కానీ తాను ఎమోషనల్ కాననుకునే ధైర్యం, పొగరుతో వెళ్లి షోలో కూర్చున్నానని, కానీ ఉన్నట్లు ఉండి కన్నీరు ఆగలేదన్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలన్నారు. తన డబ్బింగ్ వరకు మాత్రమే సినిమా గురించి తెలుసునని, మొత్తం చిత్రం ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూశానని చెప్పారు. ఈ సినిమా చూశాక మాత్రం ఓ సినిమా ప్రేమికురాలిగా ఏడుపు ఆపుకోలేకపోయినట్లు చెప్పారు.
తొలి నుండి కృష్ణవంశీ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని, అప్పట్లో మురారి సినిమా చాలాసార్లు చూసినట్లు చెప్పారు. అలాంటి దర్శకుడి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణవంశీ మహిళల పాత్రలను చాలా అందంగా, బలంగా చూపిస్తారన్నారు. ఈ సినిమాలో తన పాత్ర కూడా అలాగే ఉందన్నారు. ప్రకాష్‌రాజ్ కోడలు పాత్రలో గీతా రంగారావుగా కనిపిస్తానని, ఈ పాత్ర తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో తన పాత్రను చూసి ప్రేక్షకులు తనను తిట్టుకుంటారేమోనని దర్శకుడితో అన్నట్లు చెప్పారు. అలా ప్రవర్తించడం ఆ పాత్ర వరకు కరెక్ట్ అని కృష్ణవంశీ చెప్పారన్నారు. మళ్లీ మళ్లీ కృష్ణవంశీతో పని చేయాలని ఉందన్నారు.