Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి (Allu Arjun) అభిమానులు నల్గొండలో గ్రాండ్ వెల్ కం పలికారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌ను భట్టుగూడెంలో ఓపెనింగ్ చేసేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చారు. కంచర్ల కన్వేషన్ సెంటర్ వద్దకు రాగా 10 వేల మంది అభిమానులు ఘన స్వాగతం పలికారు. గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
అల్లు అర్జున్ (Allu Arjun) మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. తాను పోటీ చేస్తే.. అల్లుడు బన్నీ తప్పకుండా ప్రచారం చేస్తారని ఆయన ఇటీవల చెప్పారు. కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్‌కు అల్లు అర్జున్ వచ్చారు. సో.. సాగర్ నుంచి బరిలోకి దిగితే అల్లు అర్జున్ (Allu Arjun) తప్పకుండా ప్రచారం చేస్తారని ఇట్టే అర్థం అవుతోంది.
అల్లు అర్జున్ (Allu Arjun) పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సాగర్ వరకు గల దారిలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి కటౌట్స్ కనిపించాయి. తనకు మెగా కుటుంబంతో సంబంధం కలువడంపై చంద్రశేఖర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన అల్లుడు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడని.. త్వరగా కలిసిపోతాడని వివరించారు. తనకు బన్నీ అల్లుడు కావడం సంతోషంగా ఉందన్నారు.