»Ismart Beauty Nidhi Agarwal In Prabhas Maruthi Movie
Prabhas:తో ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ!
ఇస్మార్ట్ బ్యూటీగా తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది నిధి అగర్వాల్(nidhi agarwal). ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది.
Ismart beauty nidhi agarwal in Prabhas maruthi movie
ప్రస్తుతానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చేతిలో నాలుగు సినిమాలున్నాయి. సలార్, కల్కితో పాటుగా మారుతి సినిమా కూడా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది. సెప్టెంబర్ 28న సలార్, నెక్స్ట్ సమ్మర్లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత మారుతి(maruthi) సినిమా థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఆ మధ్య లీక్ అయిన ఆన్ సెట్స్ ఫోటోలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ప్రభాస్‌తో మారుతి మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్(malavika mohanan)తో పాటు, రాధే శ్యామ్‌లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న రిద్ది కుమార్(riddhi kumar) ప్రభాస్ సరసన నటిస్తున్నారు.
కానీ థర్డ్ బ్యూటీ ఎవరనేదే క్లారిటీ లేకుండా పోయింది. ముందు నుంచి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్(nidhi agarwal) పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ లేదు. అయితే మొన్న ఆగష్టు 17న నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా.. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అమ్మడికి స్పెషల్‌గా బర్త్ డే విష్ చేసింది. దీంతో ప్రభాస్ సినిమాలో నిధి కూడా నటిస్తుందనే క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవనుందట నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్‌కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. కానీ ఈ సినిమా చాలా రోజులుగా డిలే అవుతూ వస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నప్పటికీ..అధికారిక ప్రకటన లేదు. దీంతో నిధి అగర్వాల్ చేతిలో బడా హీరోల సినిమాలున్నా.. అమ్మడికి పెద్దగా కలిసి రావడం లేదు.