»Allari Naresh Ugram Movie Teaser Launch Event Update
Allari Naresh: రేపు అక్కినేని హీరో చేతుల మీదుగా ‘ఉగ్రం’ టీజర్ లాంచ్
అల్లరి నరేష్(Allari Naresh) మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి ''ఉగ్రం''(Ugram) అనే టైటిల్ ను గతంలోనే ఫిక్స్ చేశారు. తాజాగా 'ఉగ్రం'(Ugram) సినిమాకు సంబంధించిన టీజర్ ను లాంచ్(Teaser Launch) చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. సీరియస్ కంటెంట్ తీసుకుని బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా అందులో నరేష్(Allari Naresh) నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీ(OTT)లో సందడి చేస్తోంది.
Fury has a new form 🔥@allarinaresh's #Ugram Teaser out tomorrow at 11.34 AM 🔥🔥
అల్లరి నరేష్(Allari Naresh) మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. గతంలో ఈ హీరోతో ‘నాంది’ సినిమా చేసిన దర్శకుడు విజయ్ కనకమేడలతోనే మరో సినిమా చేస్తున్నాడు. పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి ”ఉగ్రం”(Ugram) అనే టైటిల్ ను గతంలోనే ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
Witness the Fury unleash Tomorrow💥#Ugram Teaser launch Tomorrow at AMB Cinemas by Yuva Samrat @chay_akkineni Garu 🔥
తాజాగా ‘ఉగ్రం'(Ugram) సినిమాకు సంబంధించిన టీజర్ ను లాంచ్(Teaser Launch) చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘ఉగ్రం’ సినిమా టీజర్(Teaser)ను ఫిబ్రవరి 22వ తేదిన ఉదయం 10 గంటలకు ఏఎంబి సినిమాస్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరో విశేషమేంటంటే ఈ సినిమా టీజర్ ను అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. వేసవి కానుకగా మే 5వ తేదిన ఈ సినిమా విడుదల(Movie Release) కానుంది.