ప్రస్తుతం ఇండియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీలా టార్గెట్ పాన్ ఇండియా సినిమాలు. పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఒక్కటే.. అనేలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మళయాళ ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో వెనకపడిపోయింది. అందుకే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పై ఆశలు పెట్టుకున్నారు.
Dulquer Salman: బాహుబలి చూపిన దారిలో ఇప్పుడు స్టార్ హీరోలంతా పయనిస్తున్నారు. బాహుబలి తర్వాత తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా అన్నీ భాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ఇక సలార్, కల్కి లాంటి సినిమాలు పాన్ వరల్డ్ రేంజ్లో వస్తున్నాయి.
నెక్స్ట్ మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న మూవీ హాలీవుడ్ రేంజ్లో రాబోతోంది. తమిళం నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించాయి. బాలీవుడ్ నుంచి పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. కన్నడ నుంచి కెజియఫ్, కాంతార సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. మళయాళం నుంచి పాన్ ఇండియా సినిమాలు పెద్దగా రావడం లేదు. అక్కడి స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నా.. పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు.
కంటెంట్ ఓరియెంటేడ్ సినిమాలు వస్తున్న పాన్ ఇండియా లెవల్లో అలరించడం లేదు. ఇప్పుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ డైరెక్ట్‌గా ‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ట్రై చేస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల అవనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే.. మాలీవుడ్ నుంచి కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి దుల్కర్ ఏం చేస్తాడో చూడాలి.