వాస్తవంగా చెప్పాలంటే.. సలార్ సినిమా పై ఉన్నంత హైప్ కల్కి పై లేదనే చెప్పాలి. ఎందుకంటే, సలార్ మాస్ సినిమా.. పైగా ప్రశాంత్ నీల్ లాంటి ఊరమాస్ డైరెక్టర్ అవడంతో.. ప్రమోషన్స్ చేయకున్న కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ కల్కికి అలా జరగడం లేదు.
Kalki: సలార్ పార్ట్ వన్ సినిమా పై ఉన్న హైప్‌కి కలెక్షన్స్ పరంగా డే వన్ అదరగొట్టింది. కానీ కల్కి, సలార్‌కు డబుల్ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయినా కూడా సినిమా రిలీజ్‌కు మరో నెల రోజులే ఉంది. కానీ ఇంకా సరిగ్గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా కాబట్టి.. కల్కికి అంతకుమించిన ప్రమోషన్స్ కావాల్సిందే. అందుకే.. ఇక్కడి నుంచి కల్కి ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడు నాగ్ అశ్విన్. మామూలుగా అయితే.. సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారు. కానీ నెల రోజుల ముందే బుజ్జి కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బుజ్జి అంటే, ప్రభాస్ కార్ అనే సంగతి తెలిసిందే కదా.
అందుకే.. ఈ ఈవెంట్ ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి ప్రమోషన్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ఐపీఎల్లో పది పదిహేను సెకన్ల యాడ్ కోసం 3 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈవెంట్ కోసం ఇంకా భారీగా ఖర్చు చేస్తున్నారట. అలాగే.. పాన్ ఇండియా లవల్లో కల్కిని ప్రమోట్ చేయడానికి 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్ సినిమా, 60 కోట్లతో ప్రమోషన్స్ అంటే.. డే వన్ రికార్డ్ రేంజ్ ఓపెనింగ్స్‌తో పాటు.. ఖచ్చితంగా వెయ్యి క్లబ్లో కల్కి ఎంట్రీ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇంత భారీగా వస్తున్న కల్కి.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.