పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు ‘అకీరా నందన్’ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అకీరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సబ్జెక్ట్‌తో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అందుకు తగ్గట్టే అకీరా ఎంట్రీ గురించి ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది.
తాజాగా ఓ సాలిడ్ అప్టేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘హిట్2’ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. అడివి శేష్, అకీరా కోసం అదిరిపోయే కథ రాస్తున్నాడనే టాక్ బయటకొచ్చింది. అడివి శేష్, అకీరా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అడివి శేష్‌కి అకీరా అంటే చాలా ఇష్టం..
అకీరా ఏం చేసినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు అడివి శేష్. అందుకే అకీరా కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. తన కథలను, స్క్రిప్టులను తానే రాసుకుంటూ.. రైటర్‌గా మంచి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు శేష్. కాబట్టి రైటర్‌గా అడివి శేష్‌ను తక్కువ అంచనా వేయలేం. అందుకే అకీరా కోసం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కథపై కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే అడివి శేష్ కథ అందిస్తున్నాడు సరే.. మరి దర్శకుడు ఎవరనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. పవర్ స్టార్ వారసుడు ఎంట్రీ అంటే.. మామూలు విషయం కాదు. మెగాభిమానుల్లో అకీరా డెబ్యూ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే నిజంగానే అడివి శేష్.. అకీరాకు కథను అందిస్తున్నాడా లేదా.. అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.