»After Getting Married I Saw A Lot Of Difficulties Sangeeta Is The Heroine Who Wants To Leave Everything Behind
Sangeeta: ప్రేమించి పెళ్లి చేసుకున్నా, తప్పని టార్చర్.. భర్తతో గొడవలపై నటి
హీరోయిన్ సంగీత క్రిష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి మధ్య విభేదాలు రావడంతో ఒక సందర్భంలో ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనుకుందట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.
After getting married I saw a lot of difficulties. Sangeeta is the heroine who wants to leave everything behind
Sangeeta: ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసిన విడాకుల ప్రస్తావనే హైలెట్ గా నిలుస్తోంది. సమాజంలో సెలబ్రిటీల పెళ్లిళ్లపై తమ అభిరుచి మారుతుంది. పెళ్లీలు స్వర్గంలో నిర్ణయించబడుతాయని నమ్మీ మనసా వాచా కర్మనా చేసుకున్న భాగస్వామితో నూరెళ్లు ఉండాలని అనేవారు. ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. పెళ్లి చేసుకోవడం, మనస్పర్థలు వస్తే వెంటనే విడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. చిన్న కారణాలతో జంటలు విడాకుల కోసం కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. ఇటీవల ప్రముఖ నటీ నిహారిక కొణిదెల విడాకులు తీసుకుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంగీత పెళ్లి తరువాత తాను అనుభవిస్తోన్న జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో తన వైవిహక జీవితం గురించి సంగీత వెల్లడించారు. తమిళ నటుడు, సింగర్ క్రిష్‌ని 2009లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాలు వీరికి దూరం అయ్యారు. ఆ సమయంలో కుటంబ సభ్యుల నుంచి ఒత్తిడి, గొడవ వల్ల ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనుకుందట. పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి మారింది. ఏదో ఒక విషయంలో గొడవలు జరిగేవట. ఒకరు చేసే పని మరొకరికి నచ్చేది కాదట. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణలు తలెత్తేవట. చాలా సార్లు గొడవ జరిగిందట. ఆ సమయం నరకంలా ఉండేదని.. వెళ్లిపోవాలి అనుకునే దానినని సంగీత చెప్పుకొచ్చారు.
పరిస్థితులు చేజారిపోతున్నాయి అని తెలిసిన సమయంలో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం అని.. అందుకే ఈ రోజు ఇద్దరం ఎవరి ఫీల్డ్‌లో వారు బిజీగా ఉన్నామని చెబుతున్నారు. సంగీత- క్రిష్ దంపతులకు ఓ పాప ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉన్నట్లు నటీ సంగీత తెలిపారు.