ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి. అయినా కూడా దర్శకుడు ‘ఓం రౌత్’ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ను తెరకెక్కిస్తున్నాడు. అసలు దర్శకుడి రామాయణ వెర్షన్ ఎలా ఉందో ఒక్క టీజర్‌తో అంచనా వేయడం కష్టం. కానీ ఆదిపురుష్ టీజర్‌కే సినిమా చూసేసినట్టు.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు కొందరు. రాముడికి మీసం, రావణసురిడికి సుర్మా.. ఇలా కొన్ని విషయాల్లో ఆదిపురుష్ పై వ్యతిరేకత వస్తోంది. ఇక డైరెక్టర్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. ఏదో ఓ విషయంలో ఆదిపురుష్ ట్రెండ్ అవుతునే ఉంది. అయినా యూట్యూబ్‌లో టీజర్ దుమ్ముదులిపేస్తోంది.
ప్రభాస్ క్రేజ్‌తో వరల్డ్ వైడ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఆదిపురుష్ టీజర్. ఇప్పటికే హిందీలో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు అన్ని భాషల్లో అంతకు మించి అనేలా రికార్డు బద్దలు కొట్టింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. అలాగే వరల్డ్ వైడ్‌గా 1.5 మిలియన్ లైక్స్‌తో.. 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ సాధించి.. నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉందన్నారు. దాంతో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా.. ఆదిపురుష్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ టీజర్ చూసిన తర్వాత అప్పుడే ఓ అంచనాకు వచ్చేశారు జనం. ఈ క్రమంలో జనవరి 12న ఓం రౌత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు.. టీజర్ రిజల్ట్‌ను రివర్స్ చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. మరి 500 కోట్ల ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.