క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamurthy) సంచలన వ్యాఖ్యలు చేశారు.నటిగా తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. గతంలో ఓ దర్శకుడు (Director) తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని, దీంతో తాను ఏడ్చేశానని చెప్పారు. ప్రాజెక్ట్ సమావేశాల కోసం అప్పుడు దర్శకులను హోటళ్లలో కలవడం సహజమేనని, ఏ సినిమాకు సంబంధించిన సమావేశాలు అయినా దాదాపు హోటల్స్ (Hotels) లోనే ఉండేవన్నారు. ఓ మూవీకి సంబంధించి తాను కూడా ఓ దర్శకుడిని హోటల్ కు వెళ్లి కలిశానని, మొదట ప్రాజెక్టు (project) గురించి చర్చించుకున్నామని చెప్పారు.ఆ తర్వాత మీకు మీ నాన్న అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా? అని సదరు దర్శకుడు అడిగారని, దానికి తాను నాకు మా నాన్న అంటే ఇష్టమని చెప్పానని తెలిపారు.
దానికి సదరు దర్శకుడు స్పందిస్తూ… మంచిదని, మీ నాన్నకు ఫోన్ చేసి రేపు ఉదయం నేను మిమ్మల్ని ఇంటి వద్ద దింపుతానని చెప్పండని తనతో అన్నాడని, ఆ మాటలు మాట్లాడటంతో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆ తర్వాత తాను అక్కడి నుండి పరుగెత్తుకొని వచ్చానన్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారినట్లు తెలిపారు.1994లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం(Bollywood movie) ‘కబీ హాన్ కబీ నా’తో ఆమె నటిగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘వాడే ఇరడే’, ‘మై వైఫ్స్ మర్డర్’, ‘కర్మ ఔర్ హోలీ’, ‘ఆగ్’ వంటి సినిమాల్లో ఆమె నటించారు. సినిమాల్లో నటిస్తోన్న తరుణంలోనే దర్శకుడు శేఖర్ కపూర్(director Shekhar Kapur)ను వివాహం చేసుకున్న సుచిత్ర.. నటనకు స్వస్తి పలికారు. ఈ క్రమంలోనే చాలా సంవత్సరాల తర్వాత ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. వైవాహిక జీవితంలో శేఖర్ నిజాయితీగా లేడని.. అందుకే తాము విడాకులు తీసుకున్నామని ఆమె వెల్లడించారు
చదవండి :Breaking: మద్యం దుకాణాలు బంద్..ఎప్పటి నుంచి అంటే