»Actress Alia Bhatts Grandfather Narendranath Razdan Passes Away At 95
Alia Bhatt Grandpa హీరోయిన్ ఆలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం
బాలీవుడ్ భామ ఆలియా భట్ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె ఇంట్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆమె తాతయ్య వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషాద వార్తను ఆలియా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుని భావోద్వేగానికి లోనైంది.
త్రిబుల్ ఆర్, బ్రహ్మస్త్ర సినిమాలతో వరుస హిట్లు కొట్టిన బాలీవుడ్ భామ ఆలియా భట్ (Alia Bhatt) తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె ఇంట్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆమె తాతయ్య వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషాద వార్తను ఆలియా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుని భావోద్వేగానికి (Emotional) లోనైంది. విషాదంలో ఉన్న తన భార్యను రణ్ బీర్ కపూర్ ఓదారుస్తున్నాడు.
‘తాత నువ్వే.. నా హీరో (Hero). 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ (Golf) ఆడావు. నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నా కోసం ఆమ్లెట్ వేసేవారు. బోలెడు కథలు చెప్పేవారు. వయోలిన్ వాయించేవారు. తన ముని మనవరాలితో (ఆలియా కూతురు)తో ఆటలు ఆడుకున్నారు. క్రికెట్, స్కెచింగ్, కుటంబాన్ని ఎంతో ప్రేమించారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ఆయన ప్రేమించారు. ఇప్పుడు మీరు లేరనే బాధతో మా మనసంతా (Heart) దు:ఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే తాతాయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించారు. దీనికి చాలా గర్వంగా (Proud) ఉంది. మనం మళ్లీ కలుసుకునే వరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటా. ఆయన మనవరాలిగా పెరిగినందుకు అదృష్టంగా భావిస్తున్నా’ అని ఇన్ స్టాలో (Instagram) పోస్టు చేసింది.
హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)ను వివాహం చేసుకున్న అనంతరం కూడా ఆలియా సినిమాలు చేస్తోంది. ఇటీవల వీరికి ఓ పాప (Baby Girl) జన్మించిన విషయం తెలిసిందే. కాగా ఆలియా భట్ బ్రహ్మాస్త సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. ప్రస్తుతానికి ఆలియా చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమా చేస్తుండగా.. రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తో మరో సినిమా చేసేందుకు సిద్ధమైంది.