TG: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు తాను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ వాపోయారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏం జరిగినా తాను ఎంతో దూరం వెళ్లానని, అలాంటిది తన అభిమానులకు ఏమైనా జరిగితే వెళ్లనా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి పరువు కోసం తాను సినిమాలు తీస్తుంటే దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరిగిందన్నారు. సినీ పరిశ్రమను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.