»Aaruguru Pathivrathalu Movie Seen By How Many People
Aaruguru Pathivrathalu : 20ఏళ్ల అయినా.. ఆ ‘ఆరుగురు పతివ్రతలు’కు క్రేజ్ తగ్గలేదు
ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరపైకి వచ్చాయి.
Aaruguru Pathivrathalu : ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరపైకి వచ్చాయి. యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాల్లో ఇది ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. సంచలన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సున్నితమైన ఇతివృత్తాలు, మనసుకు హత్తుకునే కథ, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో ఈవీవీ తనదైన శైలిలో సినిమాను రూపొందించారు.
పెళ్లయ్యాక ఆరుగురు స్నేహితులు తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ సినిమాను ఇప్పటి వరకు యూట్యూబ్లో 3 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికీ ఈ సినిమాని టీవీల్లో ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. యదార్థ సంఘటనలకు మానవత్వంతో కూడిన టచ్ ఇస్తూ ఈవీవీ సినిమా తీశారు. ఈ విషయాలు యువతను పెద్ద ఎత్తున ఆకర్షించడం విశేషం. దీనిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు, అమృత, రవివర్మ, హారిక, అజయ్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2004న విడుదలైంది.