TG: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని అల్లు అర్జున్ అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను థియేటర్ వద్ద రోడ్ షో నిర్వహించలేదన్నారు. తన కారు వెళ్లగానే ఎక్కువమంది జనాలు గుమిగూడటంతో అక్కడే ఆగిపోయామన్నారు. దీంతో జనాలకు అభివాదం చేశాను.. పోలీసులే లైన్ క్లియర్ చేస్తూ లోపలికి రమ్మని హింట్ ఇచ్చారు. దీంతో తనకు పర్మిషన్ ఉందనుకొని లోపలికి వెళ్లానన్నారు.