»A Surprise Gift To Anirudh Ravichandran From The Producer Of Jailer Kalanithi Maran
Anirudh ravichandran: జైలర్ నిర్మాత నుంచి అనిరుధ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' నాలుగో వారంలో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. తలైవర్‌ను చూడటానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చిన క్రమంలో ఈ చిత్ర నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత, కళానిధి మారన్ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు ఓ చెక్కును అందించారు. తరువాత సరికొత్త పోర్షే కారును కూడా బహుమతిగా అందించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటివల నటించిన జైలర్ చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్(kalanithi maran) సన్ పిక్చర్స్ కు బంగారు గనిగా మారింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. వారాంతాల్లో ఇప్పటికీ ప్రేక్షకులు ఈ మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 7న OTTని తాకడంతోపాటు 7వ తేదీ నుంచి జవాన్ స్క్రీన్లలో సింహభాగాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందని చెప్పొచ్చు.
అయితే ఈ చిత్రానికి అధిక వసూళ్లు రావడంతో సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందుకే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ బస్టర్ జైలర్ లాభాలను సినిమా నటీనటులు, సిబ్బందితో పంచుకోవడంలో దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జైలర్(jailer) భారీ విజయంతో నిర్మాత ఖరీదైన బహుమతులు, బోనస్‌లతో సినిమా బృందానికి లాభాలను తన స్థోమత మేరకు అందిస్తున్నారు.
ఇప్పటికే రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు ప్రకటించగా..తాజాగా సంగీత దర్శకుడు అనిరుధ్(anirudh ravichander)కి ఖరీదైన బహుమతి ఇచ్చాడు. అతనికి బోనస్ ఇవ్వడంతో పాటు తన అసలు జీతం కంటే ఎక్కువ అనిరుధ్‌కు కళానిధి మారన్ సరికొత్త పోర్ష్ కారును బహుమతిగా కూడా ఇచ్చాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజులకే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ సత్తా ఏంటో చూపించి రూ.500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది.