యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మొత్తం మూడు పార్ట్లతో వచ్చిన ఈ సిరీస్ ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, దివ్యేందు ఈ సినిమాలో నటనతో అభిమానుల నుంచి ప్రశంసలు పొందారు.