గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను ఎప్పుడూ నిరాశపరచనని తెలిపారు. తన సోలో సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుందని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.