దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తమన్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 15ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. ప్రస్తుతం తన కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. 2005లో మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. అగ్ర హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరులతో సినిమాలు చేసింది. తన అందం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టిన తమన్నాకు హ్యాపీ బర్త్ డే.