టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా..? వివరణ ఇచ్చుకుంటారా..? అని సినీ, రాజకీయ రంగాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.