‘అమరన్’ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ మూవీని భూషణ్ కుమార్ నిర్మించనున్నారట. ఈ మేరకు వీరిద్దరి మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.