గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. డల్లాస్‌లో చరణ్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నామా లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా అనేలా రిసీవ్ చేసుకున్నారని పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్‌కు మీ అందరి ఆశిస్సులు కావాలని కోరాడు.