గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్‌పై సాలిడ్ బజ్ నెలకొంది. ఈ నెల 27న జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారట. ఆయన చేతుల మీదుగా ఇది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న రిలీజ్ కానుంది.