ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద రూ.632 కోట్లు (నెట్) దక్కించుకొని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 15 రోజుల్లోనే అంత మొత్తాన్ని కలెక్ట్ చేసింది.