ప్రముఖ సింగర్ హనీ సింగ్‌పై బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దాడి చేశారని 9ఏళ్ల క్రితం వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై హనీ సింగ్ స్పందించారు. ‘షారుఖ్‌కు నేనంటే చాలా ఇష్టం. ఆయన నన్ను కొట్టలేదు. ఒకసారి మేము US టూర్‌కు వెళ్లాము. అయితే వరుస ఈవెంట్స్‌తో చాలా అలసిపోయాను. అక్కడ మరో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. అది నాకు ఇవ్వాలనిపించలేదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం నాపై నేనే దాడి చేసుకున్నా’ అని చెప్పారు.