తాను రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ‘కల్కి’ మూవీకి ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నానని జోరుగా ప్రచారం చేశారని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏంటో నాకైతే అర్థం కాలేదని.. కథ, పాత్ర నచ్చితే పారితోషికం గురించి తాను పట్టించుకోనని పేర్కొన్నారు.