మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆయన తమిళ దర్శకుడు మిత్రన్తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మిత్రన్ చిరును దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేశారట. ఇప్పుడు ఈ కథను చిరుకి వినిపించి ఓకే చేయించుకునే పనిలో మిత్రన్ ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.