ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలై భారీ హిట్ అందుకున్న చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో మూవీ టీంను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ అభినందించింది. చరిత్ర తిరగరాశారంటూ పుష్ప టీంకు ట్వీట్ చేసింది. యష్‌రాజ్ ట్వీట్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ.. మంచి సినిమాతో పుష్ప-2 రికార్డులను యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్రేక్ చేయాలని ట్వీట్ చేశాడు.