త్వరలోనే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ సినిమాగా రాబోతుంది. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలో నాతో పాటు పంకజ్, త్రిపాఠి, దివ్యేందు, అభిషేక్ బెనర్జీ కనిపిస్తారు. ఈ సిరీస్ 3 భాగాల్లో చనిపోయిన వారంతా సినిమాలో చాలాసేపు కనిపిస్తారు. దీనికోసం నా లుక్ను కూడా మార్చుకుంటున్నాను. ఈ సిరీస్ల ప్రారంభానికి ముందు ఏం జరిగిందో మూవీలో చూపిస్తారు’ అని తెలిపారు.