సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ రన్ టైంను పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 3:20 గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా 18 నిమిషాల మేర టైంను జోడించి ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో 3డి వెర్షన్లో రిలీజ్ చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.