క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉ.10:30 ప్రకటించనున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన ఓ పోస్టర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.