దర్శక దిగ్గజం రాజమౌళికి తమిళ డైరెక్టర్ అట్లీ పోటీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అట్లీ ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తన 6వ సినిమాను ప్రకటించారు. ఈ క్రమంలో రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సవాల్ విసిరేలా ఈ చిత్రం వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లను తీసుకువస్తున్నారట. రాజమౌళి సినిమా కంటే ముందు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.