నటి మంచు లక్ష్మి తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో షేర్ చేసిన లక్ష్మి ‘PEACE’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వారి ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు శుభం కార్డు పడ్డట్లేనని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.