Naga Chaitanya: నాగ చైతన్య సినిమాకు 40 కోట్ల డీల్?
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు చైతూ. అయితే.. తాజగా ఈ సినిమాకు ఏకంగా 40 కోట్ల బిజినెస్ జరిగిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్యకు సాలిడ్ హిట్ పడితే చూడాలని.. చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో.. తండేల్ సినిమాతో చైతూ మాసివ్ కొట్టి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతాడనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పైగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. దీంతో అనౌన్స్మెంట్ నుంచే తండేల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. తండేల్ డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 40 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా చెబుతన్నారు. దీంతో.. నాగ చైతన్య కెరీర్లో ఇదే అతిపెద్ద ఓటిటి డీల్ అని చెప్పాలి. ఒక్క ఓటిటి డీల్ మాత్రమే కాదు.. చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తండేల్ తెరకెక్కుతోంది. చై మార్కెట్‌కు మించిన బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాతో చైతన్య ఖచ్చితంగా పాన్ ఇండియా హిట్ కొడతాడననే నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన తండేల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చైతన్య జాలరిగా కనిపించనున్నాడు. మరి తండేల్తో చైతన్య సక్సెస్ ట్రాక్ ఎక్కి.. పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.