TG: సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో పునరాలోచిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎలాంటి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలనే దానిపై సమీక్షిస్తామన్నారు. సందేశాత్మక, దేశభక్తి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి నేపథ్యంలో తీసిన సినిమాల విషయంలో పునరాలోచిస్తామని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పరంగా తాము కూడా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.