రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇటీవల ఈ సినిమా నుంచి ధోప్ పాట ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ ఫుల్ పాట రేపు రాత్రి 8:30 నిమిషాలకు రిలీజ్ చేస్తుండగా.. అమెరికాలోని డల్లాస్లో జరిగే ఓ ఈవెంట్లో దీన్ని ఇవాళ రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 జనవరి 10న విడుదలవుతుంది.