తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను ICUలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది తన కుమారుడు మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు.