ఈ ఏడాది టాలీవుడ్లో సీక్వెల్ సినిమాలు చాలా వచ్చాయి. సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, నారా రోహిత్ ‘ప్రతినిధి-2’, అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, శ్రీసింహా ‘మత్తు వదలరా-2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాలతో పాటు ఇతర భాషల్లో కమల్ ‘ఇండియన్-2’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’ వచ్చాయి. అయితే సీక్వెల్ సినిమాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించాయి.