మలయాళ హీరో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు.